Badam Oil Benefits: చర్మ, జుట్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా.. వీటన్నింటికీ బాదం ఆయిల్ తో చెక్ పెట్టండిలా!!

సాధారణంగా అందంగా, ఆకర్షణీయంగా, మంచి స్కిన్ తో, మంచి ఒత్తైన జుట్టుతో ఉండాలని ఏ అమ్మాయైనా, అబ్బాయైనా కోరుకోకుండా ఉండలేరు. ఎవరికైనా అందంగా కనిపించాలని ఉంటుంది. మన బాడీ, స్కిన్ టోన్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటూంటారు. దీంతో కొంత మంది బ్యూటీ పార్లల వెంట క్యూ కడతారు. మరికొంత మంది హోమ్ టిప్స్ పాటిస్తూనే.. మార్కెట్లోకి ఏ కొత్త ప్రాడెక్ట్ వస్తే దాన్ని వాడేస్తూంటారు. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న ధుమ్మూ, ధూళి, ఒత్తిడి, కాలుష్యం, జంక్..

Badam Oil Benefits: చర్మ, జుట్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా.. వీటన్నింటికీ బాదం ఆయిల్ తో చెక్ పెట్టండిలా!!
Badam Oil
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 24, 2023 | 8:43 PM

సాధారణంగా అందంగా, ఆకర్షణీయంగా, మంచి స్కిన్ తో, మంచి ఒత్తైన జుట్టుతో ఉండాలని ఏ అమ్మాయైనా, అబ్బాయైనా కోరుకోకుండా ఉండలేరు. ఎవరికైనా అందంగా కనిపించాలని ఉంటుంది. మన బాడీ, స్కిన్ టోన్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటూంటారు. దీంతో కొంత మంది బ్యూటీ పార్లల వెంట క్యూ కడతారు. మరికొంత మంది హోమ్ టిప్స్ పాటిస్తూనే.. మార్కెట్లోకి ఏ కొత్త ప్రాడెక్ట్ వస్తే దాన్ని వాడేస్తూంటారు. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న ధుమ్మూ, ధూళి, ఒత్తిడి, కాలుష్యం, జంక్ ఫుడ్స్ కారణంగా చర్మం, జుట్టు సమస్యలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి.

అయితే వీటన్నింటినీ ఒక్క బాదం ఆయిల్ తో దూరం చేసుకోవచ్చు. స్కిన్ ని మెరిపించుకోవడంతో పాటు జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఇది కాస్త ఖరీదైనదే కానీ.. తక్కువ మోతాదులో వాడిన ఫలితం కనిపిస్తుంది. బాదం ఆయిల్ లో పొటాషియం, ప్రటీన్, జింక్, విటమిన్ ఏ, ఇ, మోనో శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని, జుట్టును రక్షిస్తాయి. మరి ఈ బాదం ఆయిల్ ను ఎలా వాడాలి? ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు ఒత్తుగా, డ్యామేజ్ లేకుండా రక్షిస్తుంది:

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఇప్పుడున్న కాలుష్యం కారణంగా చిట్టు పొడి బారిపోవడం, చివర్లు చిట్లడం, విపరీతంగా రాలిపోవడం వంటి సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు బాదం, ఆలివ్, ఆముదం నూనెల్ని సమ భాగాలుగా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి, మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు అయినా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. బాదం నూనెను అయినా డైరెక్ట్ గా తలకు రాసుకోవచ్చు. దీని వల్ల మృదువైన, ఒత్తైన, మెరిసే జుట్టు సొంతం అవుతుంది.

చర్మ సంరక్షణ:

– చర్మం విషయం వచ్చే సరికి రక రకాల సమస్యలు తలెత్తుతాయి. డార్క్ సర్కిల్స్, పొడి బారిపోవడం, గ్లో లేకపోవడం, ముడతలు, మచ్చటు, మొటిమలు ఇలా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికి బాదం ఆయిల్ తో చెక్ పెట్టవచ్చు. రాత్రి పడుకునే ముందు ముఖం, గొంతు భాగాలకు నూనెతో ఓ ఐదు నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. దీన్ని ఇలానే రాత్రంతా వదిలేసి ఉదయాన్నే గోరు వెచ్చటి నీటితో కడుక్కుంటే మంచి గ్లోతో పాటు సాఫ్ట్ గా మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

– రాత్రి రాసుకోలేని వారు ఉదయాన్నే స్నానం చేసే గంట ముందు ముఖానికి రాసుకుని మసాజ్ చేసుకుని గోరు వెచ్చటి నీటితో కడిగేయవచ్చు. ఫేస్ కూడా ఫ్రెష్ గా కనిపిస్తుంది.

– బాదంలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. ఈ ఆయిల్ ను కంటిన్యూ వాడితే చర్మ ఛాయ కూడా మెరుగు పడుతుంది. ముడతలు కూడా పోతాయి.

– డార్క్ సర్కిల్స్ తో బాధ పడేవారు రెండు మూడు చుక్కలు బాదం ఆయిల్ ను తీసుకుని కళ్ల కింద రాసుకుని నెమ్మదిగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే డార్క్ సర్కిల్స్ పోతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!