Lungs Protect Tips: పొంచి ఉన్న వాయు కాలుష్యం ముప్పు.. మీ ఊపిరితిత్తులను ఇలా కాపాడుకోండి..
Lungs Protect Tips: దేశ రాజధాని ఢిల్లీ సహా దాని సమీపాన ఉన్న నగరాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోతుంది. అక్కడ ప్రతీ ఏటా ఇదే పరిస్థితి ఉంటుంది.

Lungs Protect Tips: దేశ రాజధాని ఢిల్లీ సహా దాని సమీపాన ఉన్న నగరాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోతుంది. అక్కడ ప్రతీ ఏటా ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. దీపావళి పండుగ తర్వాత దట్టమైన పొగమంచు దేశ రాజధానిని కప్పేసింది. ఇవి స్వల్పకాలిక సమస్యలే అయినప్పటికీ.. మనుషల వరకు చూసుకున్నట్లయితే చాలా ప్రమాదకరమైంది. ఈ కాలుష్యం కారణంగా మానవ శరీరంలోని ఊపిరితిత్తుల సున్నితమైన పొర దెబ్బతింటుంది. ఫలితంగా అనేక సమస్యలకు కారణమవుతుంది. ఇప్పటికే ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఈ వాయు కాలుష్యం మరింత హాని తలపెడుతుంది. పొగమంచు ఆస్తమా రోగులలో తీవ్రమైన దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను మరింత పెంచుతుంది. కొంతమందికి, ఇది ఆస్తమా సమస్యకు దారి తీస్తుంది. అందుకే.. పెరుగుతున్న వాయు కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది. ముఖ్యంగా ఆస్తమా పేషెంట్లు తమ ఊపిరితిత్తులను రిక్షించుకునేందుకు ఆరోగ్య నిపుణులు పలు టిప్స్ చెబుతున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి.. కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నారు. బయటకు వెళ్లిన ప్రతిసారి తప్పకుండా మాస్క్ ధరిస్తున్నారు. అయితే, ఈ విధానాన్ని నిరంతరం కొనసాగించాలి. బయటకు వెళ్ళినప్పుడల్లా మీ ముక్కు, నోటిని కవర్ చేసేలా ఉన్న N95 మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించడం వల్ల గాలిలోని దుమ్ము, దూళి మీ ఊపిరితిత్తులలోకి ప్రవేశించకుండా కాపాడుతుంది. ఫ్లూ, కోవిడ్ 19 వైరస్ నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది.
2. అవసరమైతేనే తప్ప బయటకు వెళ్లొద్దు.. గాలి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని అవసరమైనప్పుడు మాత్రమే బయటికి వెళ్లండి. ఒకవేళ ఉదయం, సాయంత్రం వేళ వాకింగ్ కోసం బయటకు వెళ్లే ప్రయత్నాన్ని కూడా కొద్ది రోజుల వరకు విరమించుకోండి. ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి.
3. ఇండోర్ గాలి నాణ్యతను మెరుగుపరిచే చర్యలు చేపట్టండి.. వంట కోసం వినియోగించే గ్యాస్.. ఇంట్లో వాయు కాలుష్యాన్ని పెంచుతాయి. అందుకని, ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలి. కిటికీలకు ఉపయోగించే కార్పెట్‌లు, కర్టెన్లను ప్రతి వారం శుభ్రం చేయాలి. గాలిని శుద్ధి చేసే ఇండోర్ ట్రీ ప్లాంట్‌లను పెంచాలి. గాలిలో పొల్యూషన్ ఎక్కువగా ఉన్నప్పుడు.. తలుపులు, కిటికీలను పూర్తిగా మూసివేయాలి.
4. ఆవిరి పట్టాలి.. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే ఆవిరి పట్టడం చాలా ఉత్తమం. వెచ్చని నీటితో ఆవిరి పట్టడం ద్వారా నాసిక రంద్రాలు, గొంతు, ఊపిరితిత్తుల్లోని శ్లేష్మం క్లియర్ అవుతుంది. కాలుష్యం కారణంగా నాసికా భాగంలో పేరుకుపోయిన దుమ్ము, దూళి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒకవేళ మీరు కాలుష్య ప్రాంతంలో తిరిగినట్లయితే.. ఇంటికి వచ్చాక ఆవిరి పట్టడం చాలా మంచిది.
5. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినాలి.. శ్వాస నాళం ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా ఉపకరిస్తాయి. కొన్ని నిర్దిష్ట ఆహార పదార్థాలు తినడం ద్వారా ఊపిరితిత్తుల్లో మంటల తగ్గుతుంది. శ్లేష్మం క్లియర్ అవుతుంది. అంతేకాదు.. చల్లని వాతావరణంతో పోరాడేందుకు అనువైన రోగనిరోధక శక్తిని కూడా ఇస్తుంది. పసుపు, క్రూసిఫెరస్ కూరగాయలు, చెర్రీస్, ఆలివ్, వాల్‌నట్ వంటి ఫుడ్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పసుపు, పాలు, బెల్లం, తేన, ఆకు కూరలు మీలోని శక్తిని మరింత పెంచుతాయి.
6. సమయానికి మెడిసిన్స్ వేసుకోవాలి.. అన్నింటికంటే ముఖ్యమైనది ఆస్తమా లక్షణాలను నియంత్రించడానికి మెడిసిన్స్‌ని సమయానికి వేసుకోవాలి. ఉబ్బసం సమస్యతో బాధపడుతున్న వారు తమ ఇన్‌హేలర్‌లను నిత్యం వెంట ఉంచుకోవాలి. బయటకు వెళ్లిన సమయంలో ఇన్‌హేలర్ తో పాటు మెడిసిన్స్ కూడా వెంట తీసుకెళ్లాలి. ఏదైనా అసౌకర్యం అనిపించినప్పుడు ఇన్‌హేలర్‌ను ఉపయోగించవచ్చు.
Also read:
Jaggery Milk Benefits: పాలల్లో బెల్లం కలిపి తీసుకుంటే ఈ సమస్యలు ఖాతం.. ప్రయోజనాలను తెలుసుకోండి..