Bald Head: బట్టతల బాబాయ్‌లకు గుడ్ న్యూస్… జుట్టును పెంచే ప్రోటీన్ ను గుర్తించిన పరిశోధకులు.. (వీడియో)
ఎన్నో ఏళ్ల నుంచి బట్టతలకు ఓ శాశ్వత పరిష్కారాన్ని కనిపెట్టేందుకు అలుపెరుగని పరిశోధనలు జరుగుతున్నాయి..ఒక ప్రోటీన్ లోపం వల్ల ఇలా బట్టతల రావడం, జుట్టు ఊడిపోవడం జరుగుతోందని ఇప్పటికే పరిశీలకులు గుర్తించారు.
ఎన్నో ఏళ్ల నుంచి బట్టతలకు ఓ శాశ్వత పరిష్కారాన్ని కనిపెట్టేందుకు అలుపెరుగని పరిశోధనలు జరుగుతున్నాయి..ఒక ప్రోటీన్ లోపం వల్ల ఇలా బట్టతల రావడం, జుట్టు ఊడిపోవడం జరుగుతోందని ఇప్పటికే పరిశీలకులు గుర్తించారు. ఒత్తిడి కలిగించే కార్టిసోల్ వంటి హార్మోన్ల కారణంగా ఆ ప్రోటీన్ అణిచివేయబడుతోందని, దీనివల్లే వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటున్నాయని నిర్ధారించారు.. ఏ ఏ ప్రోటీన్ లోపం వల్ల బట్టతల వస్తుందో, ఆ ప్రోటీన్ ను తిరిగి సరఫరా చేయగలిగితే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్టేనని భావిస్తున్నారు.
జుట్టు పెరుగుదలకు సహకరించే ప్రోటీన్ ను GAS6 గా గుర్తించారు పరిశోధకులు. ఈ ప్రోటీన్ లోపం లేకుండా ఉంటే బట్టతల సమస్య రాదని, ఈ ప్రోటీన్ జుట్టురాలడాన్ని నిరోధిస్తుందని, కొత్త వెంట్రుకల ఉత్పత్తికి సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ ప్రోటీన్ తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. శరీరంలో ఈ ప్రోటీన్ శాతాన్ని పెంచితే అది జుట్టు కుదుళ్ల డ్యామేజ్ ను కూడా తట్టుకుని, వెంట్రుకల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుందని హార్వర్డ్ లోని స్టెమ్ సెల్, రీజెనరేటివ్ బయాలజీ ప్రొఫెసర్ వివరించారు. కేవలం ప్రోటీన్ లోపమే కాదు, మానసిక ఆందోళన, కోపం, ఒత్తిడి వంటి వాటి వల్ల కూడా జుట్టు ఊడిపోయే సమస్య పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్ బారిన పడిన వారిలో కూడా జుట్టు రాలే సమస్య అధికంగా కనిపిస్తోంది.
అయితే, ప్రస్తుతం ఎలుకలపై మాత్రమే ఈ పరిశోధన జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవులపై కూడా పరిశోధన పూర్తి చేయాల్సి ఉందన్నారు. దీనికి మరింత లోతైన అధ్యయనం అవసరమని చెప్పారు. మొత్తానికి ఇప్పటికి బట్టతలను నివారించేందుకు ఓ ప్రోటీన్ జాడ తెలిసింది. దాని సాయంతో బట్ట తల రాకుండా నివారించడమే కాదు, బట్టతల వచ్చిన వారిలో కూడా తిరిగి జుట్టు మొలిచేలా చేయవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు హార్వర్డ్ పరిశోధకులు.
మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…