Virat Kohli: విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి.. రోహిత్ శర్మ ఎంపిక మంచి నిర్ణయం..

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మెన్‌గా మరింత ఎదిగేందుకు అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు. భారత టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మంచిదేనని అన్నాడు...

Virat Kohli: విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి.. రోహిత్ శర్మ ఎంపిక మంచి నిర్ణయం..
Kohli
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 14, 2021 | 11:22 AM

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మెన్‌గా మరింత ఎదిగేందుకు అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు. భారత టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మంచిదేనని అన్నాడు. “భారత క్రికెట్‌కు అతను అద్భుతమైన శక్తి అని నేను భావిస్తున్నాను, అయితే అతను ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటే ఉత్తమం అని నేను భావిస్తున్నాను” అని ఆఫ్రిది అన్నాడు.

“నేను రోహిత్‌తో ఏడాది పాటు ఆడాను. అతను అత్యుత్తమ మనస్తత్వం కలిగిన ఆటగాడు. అది అతని అతిపెద్ద ఆస్తి. అతను అవసరమైన చోట రిలాక్స్‌గా ఉండగలడు. అవసరమైనప్పుడు దూకుడును ప్రదర్శించగలడు” అని అఫ్రిది చెప్పాడు. రోహిత్‌కు మంచి కెప్టెన్‌గా ఉండే మానసిక బలం ఉందని, అతను తన ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌తో ఈ విషయాన్ని చూపించాడని పాక్ మాజీ స్టార్ చెప్పాడు. అతను షాట్ సెలక్షన్‌తో అత్యున్నత స్థాయి ఆటగాడు. ఆటగాళ్లకు మంచి నాయకుడిగా ఉండగల మనస్తత్వం కలిగి ఉంటాడని అఫ్రిది చెప్పాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సంవత్సరంలో డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్‌తో కలిసి ఆఫ్రిది ఆడాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై కూడా అఫ్రిది స్పందించాడు. కోహ్లీ కెప్టెన్సీని వదులుకుని ఇప్పుడు మూడు ఫార్మాట్లలో తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని అతను భావించాడని చెప్పాడు. “విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుని తన మిగిలిన క్రికెట్‌ను ఆస్వాదించాలని నేను భావిస్తున్నాను. అతను ఒక టాప్ బ్యాట్స్‌మెన్ ” అని అఫ్రిది అన్నాడు.

33 ఏళ్ల కోహ్లీ, ఇటీవలే ఐపీఎల్‎లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగాడు. టీం ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇటీవలి ఇంటర్వ్యూలో కోహ్లీ వన్డే కెప్టెన్‌గా కూడా వైదొలగవచ్చని చెప్పాడు. టెస్ట్ జట్టును నడిపించడంపై మాత్రమే అతను దృష్టి పెట్టవచ్చని తెలిపాడు. 2019 చివరి నుంచి ఇప్పటివరకు కోహ్లీ టెస్టుల్లో సెంచరీ చేయలేదు.

Read Also.. T20 World Cup 2021: 16 ఏళ్లకే క్యాన్సర్.. కార్పెంటర్, ప్లంబర్‌గా పని.. మాథ్యూ వేడ్ విజయం వెనుక దాగున్న కష్టాలు ఎన్నో..