Health Tips: భోజనం తిన్న వెంటనే ఛాతీలో మంటగా ఉందా.? ఇలా ఈజీగా చెక్ పెట్టొచ్చు..

సమయం దాటిన తర్వాత భోజనం చేయడం.. అర్ధరాత్రి సమయాల్లో పడుకోవడం లాంటివి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి.

Health Tips: భోజనం తిన్న వెంటనే ఛాతీలో మంటగా ఉందా.? ఇలా ఈజీగా చెక్ పెట్టొచ్చు..
Health Tips For Food
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 04, 2022 | 6:26 PM

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవ్వరూ కూడా ఫుడ్‌ను సరైన సమయానికి తినలేని పరిస్థితి ఏర్పడింది. సమయం దాటిన తర్వాత భోజనం చేయడం.. అర్ధరాత్రి సమయాల్లో పడుకోవడం లాంటివి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. మీ జీవనశైలిలో మార్పులు చోటు చేసుకున్నట్లయితే.. కచ్చితంగా కడుపు సంబంధిత సమస్యలు వచ్చినట్లే. కొంతమందికి భోజనం తిన్న వెంటనే ఛాతీలో మంటగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలా ఉన్నట్లయితే.. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, అలాగే గ్యాస్ పెరిగిపోవడంతో ఛాతీలో మంట లేదా గుండెల్లో మంట లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఇలా వచ్చినప్పుడు.. మీ స్లీప్ పొజిషన్ ద్వారా దాని నుంచి ఉపశమనం పొందొచ్చునని వైద్యులు చెబుతున్నారు. మీరు ఎడమ వైపు నిద్రపోయినట్లయితే.. ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చునని ఇప్పటికే పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే..

గుండెల్లో మంట నుంచి ఉపశమనం పొందాలంటే..

  • తినే ఆహారాలు:

వోట్స్, తృణధాన్యాలు

ఇవి కూడా చదవండి

బ్రౌన్ రైస్

చిలగడదుంపలు, క్యారెట్లు, దుంపలు

బ్రోకలీ, కాలే, బచ్చలికూర, బీన్స్

  • దూరంగా ఉండాల్సినవి:

ఉల్లిపాయలు

సిట్రస్ పండ్లు

అధిక కొవ్వు పదార్ధాలు

టమోటాలు

మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.

గుండెల్లో మంటను నివారించే చిట్కాలు..

సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

అతిగా తినవద్దు, టైంకి తినాలి

ఆహారాన్ని పూర్తిగా నమలండి

వ్యాయామం తప్పనిసరి

వదులుగా ఉన్న దుస్తులు ధరించండి

ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి

పడుకునేటప్పుడు తల పైకెత్తి ఉంచండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..