AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinking Water: భోజనానికి ముందు లేదా తర్వాత.. హెల్దీగా ఉండాలంటే ఏ టైంలో ఎంత నీరు తాగాలో తెలుసా?

తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, కీళ్ళు, కండరాల సమస్యలతో సహా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

Drinking Water: భోజనానికి ముందు లేదా తర్వాత.. హెల్దీగా ఉండాలంటే ఏ టైంలో ఎంత నీరు తాగాలో తెలుసా?
Drinking Water
Basha Shek
|

Updated on: Nov 04, 2022 | 5:37 PM

Share

ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగడం చాలా అవసరం. ఇది మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపించడం, లాలాజలం సృష్టించడం, శరీరంలోని వివిధ భాగాలకు పోషకాలను రవాణా చేయడం వంటి కీలకమైన శారీరక విధుల్లో సహాయపడుతుంది. తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, కీళ్ళు, కండరాల సమస్యలతో సహా పలు ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. అయితే తాగునీటితో పాటు నీరు తాగడానికి సరైన సమయం కూడా ఎంతో ముఖ్యం. భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగాలని కొందరంటే, మరికొందరు భోజనానికి ముందు తాగమని సలహా ఇస్తున్నారు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. భోజనానికి 30 నిమిషాల ముందు లేదా భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీరు తాగడం మంచిది. ఒక వ్యక్తి అలసిపోయి, బలహీనంగా, సన్నగా ఉండి బరువు పెరగడానికి ప్రయత్నిస్తున్న వారు భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీల్లు తాగాలి. దీనికి విరుద్ధంగా, ఒక వ్యక్తి ఊబకాయం, అధిక బరువు, హార్మోన్ల అసమతుల్యత లేదా శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నట్లయితే, అతను / ఆమె భోజనానికి 30 నిమిషాల ముందు నీరు తాగాలి. ఇక భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల పొట్ట డిటాక్సిఫై అవుతుంది. దీనితో పాటు..

ఈ జాగ్రత్తలూ పాటించాల్సిందే..

  • ఆహారంతో పాటు నీళ్లు తాగకూడదు. భోజనంతో పాటు ఒక గ్లాసు లేదా అంతకంటే ఎక్కువ నీరు మీ కడుపు జీర్ణ శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అవసరమైతే ఇన్సులిన్ స్థాయిలు గణనీయంగా మారడానికి కారణమవుతాయి. కాబట్టి అవసరమైతే భోజనంతో పాటు కొంచెం నీరు తాగండి.
  • భోజనం చేసిన గంట తర్వాత ఎప్పుడూ నీళ్లు తాగాలి. దీనివల్ల ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించగలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  • మీరు నిద్రలేవగానే కనీసం ఒక గ్లాసు నీరు తాగండి. ఇది అనారోగ్యంతో పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
  • అలసటను ఎదుర్కోవడానికి మధ్యాహ్నం కనీసం ఒక గ్లాసు నీరు తాగాలి. మధ్యాహ్నం సమయంలో చాలామందికి డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి తగినంత నీరు తాగితే అలసట, నీరసం ఇతర సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..