AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Control Tips: వేసవిలో డయాబెటిస్‌కు చెక్ పెట్టే సూపర్ ఫుడ్ ఇదే.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Health Benefits Of Sattu: షుగర్ పేషెంట్లకు కూడా సత్తుల వినియోగం మేలు చేస్తుంది. సత్తు అనేది తక్కువ-గ్లైసెమిక్ ఇండెక్స్ పానీయం.. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరంగా..

Diabetes Control Tips: వేసవిలో డయాబెటిస్‌కు చెక్ పెట్టే సూపర్ ఫుడ్ ఇదే..  తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Sattu Roasted Gram Flour Fo
Sanjay Kasula
|

Updated on: Mar 22, 2022 | 2:23 PM

Share

ఎండలు దంచి కొడుతుండటంతో ఆ ప్రభావం మన శరీరంలో స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా ఈ సీజన్‌లో డీహైడ్రేషన్ సమస్య ప్రజలను ఎక్కువగా వేధిస్తోంది. ఇలాంటి వాతావరణంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో సత్తు షర్బత్ చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ షర్బత్‌ను ఇంట్లో లేదా మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం ద్వారా త్రాగవచ్చు. వేసవిలో చాలా మంది దుకాణదారులు మార్కెట్‌లో రోడ్డు పక్కన సత్తు పానకం విక్రయిస్తూ ఉంటారు. సత్తు షర్బత్ దాహం తీరుస్తుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇందులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. కాల్చిన శెనగల నుంచి సత్తు షర్బత్ తయారు చేస్తుంటారు. దీనిని షర్బత్ తయారు చేయడం ద్వారా వినియోగిస్తారు. సత్తు అనేది వేసవిలో ఔషధం కంటే తక్కువ లేని దేశీ పవర్ ఫుడ్. ముఖ్యంగా వేడిని పోగొట్టడానికి .. శరీరానికి శక్తిని ఇవ్వడానికి సత్తు వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. షుగర్ పేషెంట్లకు కూడా సత్తుల వినియోగం మేలు చేస్తుంది. సత్తు అనేది తక్కువ-గ్లైసెమిక్ ఇండెక్స్ పానీయం.. ఇది మధుమేహ(Diabetes) వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. వేసవిలో ఉత్తమమైన ఆహారం అయిన సత్తు వల్ల చాలా రకాలైన ప్రయోజనాల ఉన్నాయి. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం..

చక్కెరను నియంత్రిస్తుంది: సత్తు తక్కువ-గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం, డయాబెటిక్ రోగులకు ఉత్తమమైన ఆహారం. చల్లబడ్డ సత్తు సిరప్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని చెబుతున్నారు.

రక్తపోటును అదుపులో ఉంచుతుంది: సత్తువ తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. కాల్చిన శెనగపిండి నుంచి తయారుచేసిన సత్తులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. సత్తు నుంచి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి మీరు సత్తుల షర్బత్‌లో చిటికెడు ఉప్పును తీసుకోవాలి.

శరీరాన్ని చల్లగా ఉంచుతుంది: సత్తును తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. వేసవిలో దాహం తీర్చుకోవడానికి సత్తు షర్బత్ గొప్ప పానీయం.. ఇది శరీరాన్ని వేడి నుంచి కాపాడుతుంది. శరీర ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గిస్తుంది.

పోషకాలలో సమృద్ధిగా.. : శెనగలను రోస్ట్ చేసిన తర్వాత మిక్సి పడితే సత్తుగా మారుతుంది. దీని వలన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్.. మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. వాస్తవానికి, 100 గ్రాముల సత్తులో 20.6 శాతం ప్రోటీన్, 7.2 శాతం కొవ్వు, 1.35 శాతం ఫైబర్, 65.2 శాతం కార్బోహైడ్రేట్, 2.7 శాతం మొత్తం బూడిద.. 406 కేలరీలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది: సత్తును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగా పెరుగుతుంది. సత్తులో ఉండే కరగని పీచు పేగులకు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. ఇది అపానవాయువు, మలబద్ధకం, అసిడిటీని నయం చేస్తుంది.

ప్రోటీన్ లోపాన్ని ..: సత్తులో ప్రొటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్లతో రూపొందించబడింది, మిగిలినది ప్రోటీన్. ప్రొటీన్‌లు తినడం వల్ల దంతాలు, ఎముకలు బలపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి: Viral Video: లక్ష్యం కోసం రోజూ అర్ధరాత్రి 10 కి.మీటర్ల పరుగు.. ఎందుకో తెలుసా..?

Sunny Leone: కూతురు నిషాను పట్టించుకోవడం లేదని ఆరోపించిన ట్రోలర్లకు సన్నీలియోన్ కౌంటర్..