Curry Leaves Benefits: కరివేపాకే కదా అని తీసిపారేయకండి.. ఇది డయాబెటిస్‌కు దివ్యౌషధం..

కొందరు అన్నం తింటునప్పుడు కర్రిలో వచ్చిన కరివేపాకు(Curry Leaves)ను తీసిపారేస్తారు. కానీ దాని ఉపయోగాలు తెలిస్తే అలా చేయరు. ముఖ్యంగా..

Curry Leaves Benefits: కరివేపాకే కదా అని తీసిపారేయకండి.. ఇది డయాబెటిస్‌కు దివ్యౌషధం..
Curry Leaves
Follow us

|

Updated on: Mar 21, 2022 | 6:54 PM

కొందరు అన్నం తింటునప్పుడు కర్రిలో వచ్చిన కరివేపాకు(Curry Leaves)ను తీసిపారేస్తారు. కానీ దాని ఉపయోగాలు తెలిస్తే అలా చేయరు. ముఖ్యంగా షుగర్(Diabetes) ఉన్నవారు కరివేపాకు తీసుకుంటే మంచిది. కరివేపాకు పరిశోధనల్లో భాగంగా 43 మంది డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులతో నిర్వహించిన అధ్యయనంలో అనేక మంచి ఫలితాలు వచ్చాయి. వారందరికీ కరివేపాకు పొడి ఉదయం ఒక టీ స్పూన్, రాత్రి ఒక టీ స్పూన్‌ ఇచ్చి ఫలితాలను గమనించారు. బ్లడ్‌ షుగర్‌ స్థాయులు తగ్గుముఖం పట్టాయని గుర్తించారు. నెల రోజుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు (Glucose) క్రమబద్ధంగా మారడంతోపాటు జీర్ణక్రియ ఇతర జీవక్రియలు కూడా మెరుగయ్యాయని నిర్ధారించారు. మనుషుల మీద ప్రయోగించడానికి ముందు ఎలుకల మీద కూడా ముప్ఫైరోజుల అధ్యయనం చేశారు. మొత్తంగా తెలిసిందేమిటంటే… డయాబెటిస్‌కు ప్రస్తుతం వాడుకలో ఉన్న మందులకంటే కరివేపాకు వైద్యం మెరుగైన ఫలితాలనిస్తోందని నిరూపితమైంది.

కరివేపాకు మనకు లభించడం మన అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే అది వంటలకు రుచి, సువాసన ఇవ్వడమే కాదు. అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి. కరివేపాకులో ఉండే కారిబాజోల విరేచనాలకు బ్రేక్ వేస్తుంది. అందుకే ప్రతీ కూరలో కరివేపాకులు వేస్తారు. కరివేపాకు దగ్గు, జలుబులకు చెక్ పెడుతుంది. కరివేపాకు శాస్త్రీయ నామం ముర్రయ కియిని. ఇది రుటేషియ కుటుంబానికి చెందినది. కరివేపాకు ఎక్కువగా ఇండియాలోనే పండుతుంది. చైనా, ఆస్ట్రేలియా, సిలోన్, నైజీరియాల్లో కూడా కరివేపాకు మొక్కలను పెంచుతారు. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల ఔషధ గుణాల ఉన్నాయి. అందువల్ల కరివేపాకును కేవలం వంటల్లోనే కాకుండా.. వివిధ ఔషదాల్లోని ఉపయోగిస్తారు. కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపటో ప్రొటెక్టివ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన కాలేయానికి రక్షణ కల్పిస్తాయి.

జుట్టు సమస్యలను నివారించేందకు కరివేపాకు ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. అజీర్తి, ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తిని నివారిస్తుంది. కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన, తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోపడతాయి. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి బరువు తగ్గిస్తుంది. ఆమ్లశ్రావం, జీర్ణ పూతలు, ఎముకల అరుగుదలకు, డయాబెటిస్, అతిసారం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలను నియంత్రిస్తుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Read Also.. Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ రోస్టెడ్ స్నాక్స్ ట్రై చేయండి..

Latest Articles
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
తోటి నటులే హీరోయిన్‌ను చంపి.. తల నరికిన దారుణ ఘటన..!
తోటి నటులే హీరోయిన్‌ను చంపి.. తల నరికిన దారుణ ఘటన..!
OTTలో గీతాంజలి.. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్.
OTTలో గీతాంజలి.. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్.