Vitamin C: విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే సమస్యలొస్తాయా? ఏది నిజం.. ఏది అబద్ధం..

5 Myths About Vitamin C: కరోనావైరస్ మహమ్మారి నాటి నుంచి చాలామంది ఆరోగ్యంపై దృష్టిసారించారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకుంటున్నారు.

Vitamin C: విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే సమస్యలొస్తాయా? ఏది నిజం.. ఏది అబద్ధం..
Vitamin C
Follow us

|

Updated on: Mar 21, 2022 | 5:12 PM

5 Myths About Vitamin C: కరోనావైరస్ మహమ్మారి నాటి నుంచి చాలామంది ఆరోగ్యంపై దృష్టిసారించారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకుంటున్నారు. కరోనా నాటి నుంచి శరీరానికి విటమిన్ సి అవసరం గురించి అందరూ తెలుసుకున్నారు. వాస్తవానికి విటమిన్ సీ ఒక ముఖ్యమైన పోషకం. శరీర కణజాలాల పెరుగుదల, కొల్లాజెన్ ఏర్పడటం, ఎముకలు, దంతాల నిర్వహణ, శరీరంలో శక్తి పెంపొందించేందుకు విటమిన్ సి మనకు సహాయపడుతుంది. అయినప్పటికీ COVID-19 నాటి నుంచి ప్రజలకు విటమిన్ సి గురించి కొంత తప్పుడు సమాచారం చేరుతోంది. విటమిన్ సి గురించి 5 అపోహలు.. వాటి వెనుక ఉన్న నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  1. విటమిన్ సి ఎక్కువగా తీసుకోవచ్చా..? విటమిన్ సి గరిష్ట పరిమితిని కలిగి ఉంటుంది. ఇది రోజుకు 2,000 మిల్లీగ్రాములను తీసుకోవచ్చు. ఎక్కువ తీసుకున్నా మిగులు మూత్రం ద్వారా మూత్రపిండాల ద్వారా బయటకు వస్తుంది. శరీరంలో ఉండే క్రమంలో ఇది వికారం, వాంతులు, విరేచనాలు, ఉబ్బరం, మూత్రపిండాల్లో రాళ్లు వంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అందుకే ప్రతి పోషకాన్ని సరైన మోతాదులో తీసుకోవడం చాలా అవసరం.
  2. ఎంత ఎక్కువగా తీసుకుంటే, వ్యాధి నిరోధక శక్తి అంత మెరుగుపడుతుందా..? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక వయోజన మహిళకు రోజుకు 75 mg విటమిన్ సి సరిపోతుంది. పురుషులకు 90 గ్రాములు కావాలి. రోగనిరోధక శక్తిని పెంచడం, కణాల పెరుగుదల వంటి పోషకాల ప్రయోజనాలను పొందేందుకు ఈ మొత్తం సరిపోతుంది.
  3. విటమిన్ సి కి మూలం నారింజ పండ్లు..? విటమిన్ సి బెల్ పెప్పర్స్, జామపండ్లు, రేగు పండ్లు, పార్స్లీ, కివీలలో కూడా ఉంటుంది. వాస్తవానికి నారింజ పండ్ల కంటే వీటిలోనే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. బెల్ పెప్పర్స్ 100 గ్రాములకు 128 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది.
  4. విటమిన్ సి కోవిడ్‌ను నయం చేస్తుంది.. విటమిన్ సి కోవిడ్‌ను నయం చేస్తుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. సాధారణ జలుబును తగ్గించే సామర్థ్యం విటమిన్ సి కి ఉన్న కారణంగా COVID ప్రారంభమైనప్పటి నుంచి నిపుణులు ఎక్కువ తీసుకోవాలని సూచించారు. జలుబు – కోవిడ్ రెండూ శ్వాసకోశ వ్యాధులు కాబట్టి ఈ అపోహ దృష్టిలోకి వచ్చింది. విటమిన్ సి ఒక యాంటీ ఆక్సిడెంట్.. కొంత వరకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని కారణంగా ఇది శరీరాన్ని వైరల్ దాడుల నుంచి కొంత వరకు రక్షిస్తుంది. కానీ ఇది ఖచ్చితంగా కోవిడ్‌కు నివారణ కాదు
  5. విటమిన్ సి – రోగనిరోధకశక్తి.. విటమిన్ సి శక్తిని పెంపొందించడమే కాదు.. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. చర్మ సమస్యలు, రక్తనాళాల నియంత్రణ, గాయాలను త్వరగా మాన్పించే గుణం ఉంటుంది. గౌట్‌ను నివారించడానికి రక్తంలో యూరిక్ స్థాయిలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.