AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ రోస్టెడ్ స్నాక్స్ ట్రై చేయండి..

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది కష్టపడుతున్నారు. అయితే.. బరువు తగ్గడం మాత్రం అంత సులభం కాదు.  దీనికోసం క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా ఆసనాలు వేయడం చాలా ముఖ్యం.

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ రోస్టెడ్ స్నాక్స్ ట్రై చేయండి..
Snaks
Shaik Madar Saheb
|

Updated on: Mar 21, 2022 | 4:43 PM

Share

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది కష్టపడుతున్నారు. అయితే.. బరువు తగ్గడం మాత్రం అంత సులభం కాదు.  దీనికోసం క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా ఆసనాలు వేయడం చాలా ముఖ్యం. దీంతోపాటు ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బరువు తగ్గేందుకు డైటింగ్‌లో ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఆకలితో ఉన్నప్పుడు తినపోవడం, తినాలనుకున్నప్పుడు అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనకు ఆకలిగా అనిపించినప్పుడు చాలా సార్లు జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి తీసుకుంటాం. ఇది మన ఆరోగ్యానికి హానికరం. ఇలాంటి పరిస్థితిలో (Roasted Snacks) నూనె కలపకుండా.. నిప్పులపై వేయించిన వేపుడు పదార్థాలను తినడం చాలా మంచిది. తక్కువ కేలరీలు ఉన్న ఆరోగ్యకరమైన, రుచికరమైన స్నాక్స్‌ని మీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిన్నారు.

ఫాక్స్ నట్ (మఖానా) : డైటింగ్ సమయంలో అల్పాహారంలో భాగంగా కాల్చిన మఖానా తినడం చాలా మంచిది. మఖానాలో క్యాలరీలు చాలా తక్కువ. మఖానాలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. మఖానాలో కార్బోహైడ్రేట్ల పరిమాణం కూడా తక్కువే.. మీకు ఆకలిగా అనిపించినప్పుడు కాల్చిన మఖానాను తినండి..

బాదం : కాల్చిన బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. బాదంపప్పు తినడం వల్ల శరీరానికి పీచు పదార్థం పుష్కలంగా అందుతుంది. బాదంపప్పు తినడం వల్ల గుండె, కొలెస్ట్రాల్ సమస్య కూడా తొలగిపోతుంది. ఇది బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

శెనగలు : బరువు తగ్గాలనుకున్నవారు శెనగలు తినడం చాలా మంచిది. వేయించిన శెనగలు తినడం వల్ల ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. వేయించిన శెనగపప్పు తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు.

తృణధాన్యాలు : మీరు డైటింగ్ సమయంలో ఆరోగ్యకరమైన స్నాక్స్‌లో భాగంగా వేయించిన విత్తనాలను కూడా తినవచ్చు. మీకు నచ్చిన తృణ ధాన్యాలను వేయించి తినవచ్చు. పొద్దుతిరుగుడు, పొట్లకాయ, లిన్సీడ్, పుచ్చకాయ, గుమ్మడి గింజలను కాల్చి, వాటిని ఒక కూజాలో నిల్వ చేయండి. ఆకలితో ఉన్నప్పుడు వాటిని తింటే.. ఆరోగ్యంతోపాటు బరువు కూడా అదుపులో ఉంటుంది.

బఠానీలు : మీరు ఆరోగ్యకరమైన స్పైసీ స్నాక్స్ తినాలనుకుంటే మీరు వేయించిన బఠానీలను తినవచ్చు. బఠానీలలో చాలా విటమిన్లు ఉంటాయి. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన స్నాక్‌గా కూడా వీటిని తీసుకోవచ్చు. టీ లేదా కాఫీతో కూడా వీటిని తినవచ్చు.

పాప్ కార్న్ : పాప్‌కార్న్ కూడా ఆరోగ్యకరమైన చిరుతిండి. వీటిలో చాలా తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గే సమయంలో మీరు పాప్‌కార్న్ తినడం చాలా మంచిది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది.

Also Read:

Back pain: వెన్నునొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? అయితే వీటిని తినడం మర్చిపోకండి..

One Rupee Idly, Bonda: గత కొన్నేళ్లుగా ఒక్క రూపాయికే ఇడ్లీ, బొండాలు.. క్వాలిటీ టిఫిన్ కోసం కస్టమర్స్ క్యూ.. ఎక్కడంటే