Health Tips: వేసవిలో పసుపును అధికంగా వాడుతున్నారా.. అయితే డేంజర్ జోన్‌లో పడ్డట్లే..
Side Effects of Haldi in Summer: పసుపు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, వేసవిలో ఎక్కువగా తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు కలిగిస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో మనమందరం పసుపు(Turmeric)ను విపరీతంగా తీసుకున్నాం. అదే టైంలో కరోనా కేసులు పెరగడంతో విపరీతంగా పసుపును పలు రకాలుగా ఉపయోగించాం. పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కరోనా(Covid-19)ను నివారించడానికి పసుపు పాలుతీసుకోవడంతోపాటు ఆహారంలో ఎక్కువగా పసుపును ఉపయోగించారు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. అయితే వేసవి(Summer)లో పసుపు ఎక్కువగా తినడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. పసుపు ప్రభావం చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి వేసవిలో పసుపు ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల రాళ్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వేసవిలో పసుపును అతిగా తినడం వల్ల కలిగే హాని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1- కిడ్నీలో రాళ్లు ఏర్పడే ఛాన్స్- వేసవిలో పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో రాళ్లు ఏర్పడతాయి. పసుపులో ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం కరిగిపోకుండా చేస్తుంది. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.
2- కడుపులో మంట- వేసవిలో పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో మంట, తిమ్మిర్లు, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. పసుపు చాలా మంది ప్రజల ఇళ్లలో ఉపయోగిస్తుంటారు. వేసవిలో పసుపును పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో పసుపును విడిగా తినవల్సిన అవసరం లేదు.
3- వాంతులు, విరేచనాలు- వేసవిలో పసుపు ఎక్కువగా తినడం వల్ల వాంతులు, విరేచనాలు వస్తాయి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను పెంచుతుంది. చాలా మందికి వాంతులు. విరేచనాలు కూడా మొదలవుతాయి. కాబట్టి వేసవిలో పసుపును పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
4- రక్తాన్ని పల్చగా మార్చవచ్చు- పసుపులో రక్తాన్ని పలుచన చేసే గుణాలు ఉన్నాయి. పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, అధిక పసుపు తినకూడదు. దీని కారణంగా, వేసవిలో రక్తస్రావం సమస్య ఉంటుంది. అలాగే మహిళల్లో పీరియడ్స్ సమయంలో ఎక్కువ రక్తస్రావం కలిగే ఛాన్స్ ఉంటుంది. దీని కారణంగా మహిళలు బలహీనంగా కనిపిస్తారు.
5- గర్భిణీ స్త్రీలకు ప్రమాదం- పసుపు లేదా వేడి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం గర్భిణీ స్త్రీలకు, శిశువుకు హానికరం. దీంతో ప్రెగ్నెన్సీ ప్రారంభంలో రక్తస్రావం సమస్యలు లేదా గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఉంటుంది.
Also Read: Curry Leaves Benefits: కరివేపాకే కదా అని తీసిపారేయకండి.. ఇది డయాబెటిస్‌కు దివ్యౌషధం..
Vitamin C: విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే సమస్యలొస్తాయా? ఏది నిజం.. ఏది అబద్ధం..




