18 Pages : ఈ కుర్రహీరో “18 పేజెస్” లో ఏం రాసుకొని రాబోతున్నాడో తెలిసేది అప్పుడే.. నిఖిల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి ఫుల్ బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా కాస్త గ్యాప్ రావడంతో ఇప్పుడు వరుస సినిమాలను పట్టాలెక్కించాడు.

18 Pages : ఈ కుర్రహీరో 18 పేజెస్ లో ఏం రాసుకొని రాబోతున్నాడో తెలిసేది అప్పుడే.. నిఖిల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..
Nikhil
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Nov 13, 2021 | 6:46 AM

18 Pages: యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి ఫుల్ బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా కాస్త గ్యాప్ రావడంతో ఇప్పుడు వరుస సినిమాలను పట్టాలెక్కించాడు. ప్రస్తుతం నిఖిల్.. అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ మరియు జీఏ2 బ్యానర్ లు సంయుక్తంగా 18 పేజెస్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీర్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సుకుమార్ విలక్షణమైన పాత్రలను సృష్టిస్తున్నాడట. నిఖిల్ కోసం అలంటి పాత్రనే సృష్టించాడట సుకుమార్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో నిఖిల్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాతో కెరియర్ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు నిఖిల్. అందులో ఒకపాత్ర గతం మరిచిపోయే నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతుంది.ఈ సినిమాతోపాటు నిఖిల్ నటిస్తున్న కార్తికేయ 2 కూడా షూటింగ్ చకచక జరుగుతోంది.ఈ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరనే హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి.

NTR’s EMK Contestant: సామాన్యుడిని కోటీశ్వరుడు చేసిన తారక్ షో.. తన తెలివితేటలతో దుమ్ము రేపిన పోలీసు…

Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్‌ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..