హిట్ కోసం క్రియేటివ్ దర్శకుడి తిప్పలు.. ఫలితం లభించేనా..!
కృష్ణవంశీ.. క్రియేటివ్ దర్శకుడిగా ఈయనకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. 24 ఏళ్లలో కేవలం 20 సినిమాలే తెరకెక్కించినప్పటికీ.. ఉత్తమ దర్శకుడిగా నాలుగు నంది అవార్డులు, మూడు ఫిలింఫేర్ అవార్డులు సాధించుకున్నారు. అంతేకాదు ఆయన తెరకెక్కించిన రెండు చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. కానీ ‘చందమామ’ చిత్రం తరువాత ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. దాదాపు 12 ఏళ్లుగా ఆయన ఖాతాలో పెద్ద హిట్ లేదు. దీంతో స్టార్ హీరోలు కూడా ఆయనకు దూరమవుతూ వచ్చారు. […]
కృష్ణవంశీ.. క్రియేటివ్ దర్శకుడిగా ఈయనకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. 24 ఏళ్లలో కేవలం 20 సినిమాలే తెరకెక్కించినప్పటికీ.. ఉత్తమ దర్శకుడిగా నాలుగు నంది అవార్డులు, మూడు ఫిలింఫేర్ అవార్డులు సాధించుకున్నారు. అంతేకాదు ఆయన తెరకెక్కించిన రెండు చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. కానీ ‘చందమామ’ చిత్రం తరువాత ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. దాదాపు 12 ఏళ్లుగా ఆయన ఖాతాలో పెద్ద హిట్ లేదు. దీంతో స్టార్ హీరోలు కూడా ఆయనకు దూరమవుతూ వచ్చారు. అయితే ఇవన్నీ ఆయన లెక్కచేయడం లేదు. ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని మాత్రమే చూస్తున్నాడు. ఈ క్రమంలో మరాఠీలో పెద్ద విజయం సాధించిన ‘నట్‌సామ్రాట్’ను ‘రంగమార్తాండ’ అనే పేరుతో తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు కృష్ణవంశీ.
రెడ్‌బల్బ్ మూవీస్, హౌస్‌ఫుల్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి చెందిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ మూవీ కోసం ఇప్పుడు మ్యూజిక్ మాస్ట్రో, ఇసైజ్ఞాని ఇళయరాజాను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు కృష్ణవంశీ. దీనికి సంబంధించి ఇటీవల ఇళయరాజాను కలుసుకొని సంప్రదింపులు జరిపిన కృష్ణవంశీ.. ఆయనతో ఫొటో కూడా తీసుకున్నారు. కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో 1998లో ‘అంత:పురం’ తెరకెక్కగా.. ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు స్టోరీ తనకు నచ్చితే తప్ప.. ఏ సినిమాకు సంగీతం అందించడానికి ఒప్పుకోరు ఇళయరాజా. ఇక ఆయన కృష్ణవంశీ సినిమాకు ఒప్పుకున్నారంటే.. అందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉందని అర్థమవుతోంది. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ కోసం తన భార్య రమ్యకృష్ణను రంగంలోకి దింపడంతో పాటు.. ఇళయరాజాను కూడా మెప్పించాడంటే కృష్ణవంశీ హిట్ కొట్టడం ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి. మరి ఈ ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలంటే మాత్రం సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.