AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ అజిత్.. ఇక్కడ మహేష్.. సరిలేరు వీరికెవ్వరు..!

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించి.. ఈ ఏడాది హిట్ మూవీల లిస్ట్‌ల చేరిపోయింది. కాగా తాజాగా ఈ మూవీకి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 2019 సంవత్సరానికి గానూ ‘మోస్ట్ ఇన్‌ఫ్లూయన్సల్ మూమెంట్స్‌ ఆఫ్ ట్విట్టర్‌’లో ‘మహర్షి’ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఇందులో అజిత్ నటించిన ‘విశ్వాసం’ మొదటిస్థానంలో ఉండగా.. ‘లోక్‌సభ […]

అక్కడ అజిత్.. ఇక్కడ మహేష్.. సరిలేరు వీరికెవ్వరు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 13, 2019 | 8:27 PM

Share

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించి.. ఈ ఏడాది హిట్ మూవీల లిస్ట్‌ల చేరిపోయింది. కాగా తాజాగా ఈ మూవీకి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 2019 సంవత్సరానికి గానూ ‘మోస్ట్ ఇన్‌ఫ్లూయన్సల్ మూమెంట్స్‌ ఆఫ్ ట్విట్టర్‌’లో ‘మహర్షి’ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఇందులో అజిత్ నటించిన ‘విశ్వాసం’ మొదటిస్థానంలో ఉండగా.. ‘లోక్‌సభ ఎలక్షన్స్ 2019’, ‘సీడబ్ల్యూసీ 19’లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక ఐదో స్థానంలో ‘దీపావళి’ చోటు దక్కించుకోవడం విశేషం. ఈ విషయాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

కాగా గతేడాది కూడా అజిత్, మహేష్‌ మూవీలు ఈ లిస్ట్‌లో స్థానం దక్కించుకున్నాయి. అజిత్ నటించిన ‘విశ్వాసం’, మహేష్ నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రాలు ‘బిగ్గెస్ట్ మూమెంట్స్ ఇన్ ఇండియా’లో చోటు సంపాదించుకున్నాయి. దీంతో  కోలీవుడ్‌లో అజిత్.. టాలీవుడ్‌లో మహేష్‌ వరుసగా ఈ ఘనత దక్కించుకున్న లిస్ట్‌లో చేరిపోయారు. ఇక ‘విశ్వాసం’ హ్యాష్‌ట్యాగ్ గతేడాది, ఈ ఏడాది రెండుసార్లు చోటు దక్కించుకోవడం మరో విశేషం.

కాగా ఫ్రెండ్‌షిప్, రైతుల కథాంశం నేపథ్యంలో ‘మహర్షి’ తెరకెక్కింది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.170కోట్ల రూపాయలను వసూలు చేసింది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
నెలకు రూ.20 వే ఆదాయం.. కేంద్ర ప్రభుత్వ పథకంతో..
నెలకు రూ.20 వే ఆదాయం.. కేంద్ర ప్రభుత్వ పథకంతో..
6 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా..థియేటర్లలో అట్టర్ ప్లాప్.
6 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా..థియేటర్లలో అట్టర్ ప్లాప్.
వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి
వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి
రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. అతడికి ధోనీ హితబోధ
రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. అతడికి ధోనీ హితబోధ
పెళ్లిళ్లకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధర
పెళ్లిళ్లకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధర
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి
భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..
ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..