డిజైనర్ డ్రెస్‌లో త్రిషా మ్యాజిక్.. కవ్విస్తున్న చెన్నై సుందరి.. 

Rajitha Chanti

Pic credit - Instagram

05  July 2026

టాలీవుడ్, కోలీవుడ్‌లలో రెండు దశాబ్దాలుగా తన అమోఘమైన అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష కృష్ణన్.

ఈ చెన్నై సొగసరి తాజాగా మరోసారి తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తోపాటు.. అందమైన చిరునవ్వుతో సోషల్ మీడియాను షేక్ చేసింది. 

గోవాలో జరిగిన ఒక గ్రాండ్ పెళ్లి వేడుక కోసం ఆమె ధరించిన సాంప్రదాయ దుస్తులు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

పసుపు రంగు (Yellow) డిజైనర్ డ్రెస్‌లో త్రిష దేవకన్యలా మెరిసిపోతూ, ఎథ్నిక్ ఫ్యాషన్‌కు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఈ ప్రత్యేకమైన వేడుక కోసం త్రిష ప్రముఖ డిజైనర్ గుప్త రూపొందించిన స్టైలిష్ యెల్లో డ్రెస్‌ను ఎంచుకుంది. మరింత అందంగా ఉంది.

 స్లీవ్‌లెస్ టాప్‌పై మల్టీ కలర్ త్రెడ్‌తో చేసిన హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ డ్రెస్‌కు ఒక రాయల్ లుక్‌ను తీసుకొచ్చింది. ఫోటోస్ వైరలవుతున్నాయి.

దీనికి మ్యాచింగ్‌గా సాఫ్ట్ బాటమ్, చేతులపై స్టైలిష్‌గా వేసుకున్న నెట్టెడ్ దుపట్టాతో త్రిష ఎంతో హుందాగా, క్లాసీగా కనిపించింది. 

ప్రకృతి అందాల నడుమ ఎషాన్‌ రాజు, ఖుష్బూ గుప్తా తీసిన ఈ ఫోటోలలో త్రిష లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.