మహబూబాబాద్ జిల్లా సింగారంలో మాజీ ఉపసర్పంచ్ యాకయ్య హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, ఆస్తి వివాదాల నేపథ్యంలో యాకయ్య భార్య యశోద రూ. 4 లక్షల సుపారీ ఇచ్చి సుపారీ గ్యాంగ్‌తో భర్తను హత్య చేయించింది. ఈ కేసులో యశోద సహా ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.