AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Korrala Idli: కొర్రల ఇడ్లీ ఇలా చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి తిరుగుండదు!

ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోవడంతో చాలామంది మిల్లెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, వాటితో వంటలు చేయడం కాస్త కష్టమనే భ్రమ చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా మిల్లెట్ ఇడ్లీలు అనగానే గట్టిగా వస్తాయేమో అని భయపడతారు. కానీ, సరైన కొలతలతో చేసుకుంటే సాధారణ ఇడ్లీల కంటే ఎంతో మృదువుగా, రుచిగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఈ పక్కా కొలతల కొర్రల ఇడ్లీ విధానం మీ ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Phani CH
|

Updated on: Jul 05, 2026 | 10:15 PM

Share
 ఈ హెల్దీ ఇడ్లీల కోసం ఒక గ్లాసును కొలతగా పెట్టుకోవాలి. రెండున్నర గ్లాసుల కొర్రల ఇడ్లీ రవ్వకు ముప్పావు గ్లాసు మినపగుళ్లు కరెక్ట్ గా సరిపోతాయి. మీకు ఇంకా కాస్త మెత్తగా రావాలి అనుకుంటే ఒక గ్లాసు నిండుగా మినపగుళ్లను తీసుకోవచ్చు. మినపగుళ్లను మూడు, నాలుగు సార్లు శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి కనీసం 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి.

1 / 5
ఇక కొర్రల రవ్వ విషయానికి వస్తే, దీనిని మినప్పప్పు రుబ్బుకునే ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ వీలు కుదరకపోతే మినపగుళ్లతో పాటే నానబెట్టుకున్నా పర్వాలేదు. పిండి తయారీ విధానం బాగా నానిన మినపగుళ్లను గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండర్ లేనివారు మిక్సీలో వేసేటప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ లేదా చల్లటి నీటిని ఉపయోగిస్తే పిండి బాగా మెదుగుతుంది.

2 / 5
తర్వాత నానిన కొర్రల రవ్వను నీళ్లు లేకుండా గట్టిగా పిండుకుంటూ ఈ మినప్పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. మిల్లెట్స్ పిండి త్వరగా పులిసిపోతుంది కాబట్టి, మనకు కావలసినంత పిండిని మాత్రమే బయట ఉంచి, మిగిలిన దాన్ని ఫ్రిజ్ లో దాచుకోవడం మంచిది. రాత్రంతా పులియబెట్టిన పిండి మరుసటి రోజు ఉదయానికి ఇడ్లీలకు పర్ఫెక్ట్‌గా సిద్ధమవుతుంది.

3 / 5
ఇడ్లీల తయారీ మరియు స్పెషల్ చట్నీ ఉదయాన్నే పులిసిన పిండిలో తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి, ఈ పిండిని వేసి పాత్రలో ఉంచి 10 నుండి 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఈ లోపు దీనికి కాంబినేషన్‌గా అదిరిపోయే టమాటో-పల్లీ చట్నీ తయారు చేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాసు వేరుశనగ గుళ్లను వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో ఐదు టమాటాలు, మూడు ఎండుమిర్చి, అర టీస్పూన్ జీలకర్ర వేసి నీళ్లలో మెత్తగా ఉడికించాలి. వీటన్నింటినీ మిక్సీలో వేసి ఉప్పుతో పాటు గ్రైండ్ చేసి, పోపు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన పల్చటి చట్నీ సిద్ధమవుతుంది.

4 / 5
వేడివేడి సాఫ్ట్ కొర్రల ఇడ్లీలను ఈ టమాటో చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడానికి, అలాగే ఉదయాన్నే మంచి శక్తిని ఇవ్వడానికి ఈ బ్రేక్‌ఫాస్ట్ ఎంతో మేలు చేస్తుంది. నార్మల్ ఇడ్లీలకు బదులుగా వారంలో కనీసం రెండు సార్లైనా ఇలాంటి హెల్దీ మిల్లెట్ ఇడ్లీలను అలవాటు చేసుకుంటే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు.

5 / 5
Follow Us