వివాదాస్పద అంశంతో తేజ కొత్త మూవీ.. మొదటిసారిగా..!

సినీ పరిశ్రమలో తాజా నివేదికల ప్రకారం దర్శకుడు తేజా తన తదుపరి చిత్రంగా ఒక వివాదాస్పద ప్రాజెక్టును తీసుకురావాలని యోచిస్తున్నాడు. సీత సినిమా పరాజయం తరువాత, దర్శకుడు తేజ కొత్త సినిమాను ప్రకటించలేదు. అనేక ప్రాజెక్టులను ప్లాన్ చేసాడు కాని ఇప్పటి వరకు ఏవీ వర్కవుట్ కాలేదు. అందువల్ల, వివాదాస్పద విషయం ఆధారంగా ‘ఆర్టికల్ 370’ ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పరిశోధనలు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. తేజ ఈ చిత్రం తెలుగు, […]

  • Publish Date - 6:45 pm, Wed, 13 November 19 Edited By:
వివాదాస్పద అంశంతో తేజ కొత్త మూవీ.. మొదటిసారిగా..!

సినీ పరిశ్రమలో తాజా నివేదికల ప్రకారం దర్శకుడు తేజా తన తదుపరి చిత్రంగా ఒక వివాదాస్పద ప్రాజెక్టును తీసుకురావాలని యోచిస్తున్నాడు. సీత సినిమా పరాజయం తరువాత, దర్శకుడు తేజ కొత్త సినిమాను ప్రకటించలేదు. అనేక ప్రాజెక్టులను ప్లాన్ చేసాడు కాని ఇప్పటి వరకు ఏవీ వర్కవుట్ కాలేదు. అందువల్ల, వివాదాస్పద విషయం ఆధారంగా ‘ఆర్టికల్ 370’ ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన పరిశోధనలు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. తేజ ఈ చిత్రం తెలుగు, హిందీ భాషలలో చేయాలనుకుంటున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతానికి, దర్శకుడి నుండి స్పష్టత లేదు, కానీ అతనితో కలిసి పనిచేస్తున్న బృందం తెలిపిన సమాచారం ప్రకారం దర్శకుడు గ్రిప్పింగ్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. వివరాలు తెలియాల్సి ఉంది.