మెగాస్టార్‌పై కొరటాల మౌనం వెనుక కారణమేంటి..!

టాలీవుడ్‌లో ఉన్న టాప్ దర్శకుల లిస్ట్‌లో కొరటాల శివ ఒకరు. రచయితగా పలు చిత్రాలకు పనిచేసిన ఆయన.. ‘మిర్చి’తో దర్శకుడిగా మారారు. ఆ తరువాత ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’.. ఇలా అన్ని విజయవంతమైన చిత్రాలను తీసి టాప్ డైరక్టర్‌గా మారాడు. అంతేకాదు మెగాస్టార్‌ చిరంజీవిని డైరక్ట్ చేసే అవకాశాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. చిరు 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రామ్ చరణ్ […]

మెగాస్టార్‌పై కొరటాల మౌనం వెనుక కారణమేంటి..!
Follow us

| Edited By:

Updated on: Oct 07, 2019 | 4:30 PM

టాలీవుడ్‌లో ఉన్న టాప్ దర్శకుల లిస్ట్‌లో కొరటాల శివ ఒకరు. రచయితగా పలు చిత్రాలకు పనిచేసిన ఆయన.. ‘మిర్చి’తో దర్శకుడిగా మారారు. ఆ తరువాత ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’.. ఇలా అన్ని విజయవంతమైన చిత్రాలను తీసి టాప్ డైరక్టర్‌గా మారాడు. అంతేకాదు మెగాస్టార్‌ చిరంజీవిని డైరక్ట్ చేసే అవకాశాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. చిరు 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు ఆ మధ్యలో వార్తలు వినిపించినా.. వాటిపై చరణ్ క్లారిటీ ఇచ్చేశాడు. చిరు-కొరటాల మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెర్రీ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అన్ని అనుమానాలు తొలిగిపోయాయి. అంతేకాదు సైరా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చిరు.. ఆ తరువాత బరువు తగ్గగా.. కొరటాల శివ మూవీ కోసం ఆయన కసరత్తులు చేస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇదంతా పక్కనపెడితే ఇటీవల చిరంజీవి ‘సైరా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చారిత్రాత్మక కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీపై విమర్శకులు ప్రశంసలు కురిపించగా.. బాక్సాఫీస్ వద్ద బాస్ స్టామినాను చూపిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ మూవీపై టాలీవుడ్ టాప్ దర్శకులు, హీరోలు, హీరోయిన్లు సోషల్ మీడియాలో స్పందించారు. సినిమా విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే సైరాను చూసిన వీరు మూవీపై తమ అభిప్రాయం వ్యక్తపరిచారు. ”సినిమా అద్భుతం.. మెగాస్టార్ సార్ మీరు గ్రేట్.. బాస్ మీకు హ్యాట్సాఫ్” అంటూ ప్రతి ఒక్కరు చిరుకు అభినందనలు తెలిపారు. మరికొందరైతే సినిమాను చూడకపోయినా.. సినిమా టాక్ అదిరిపోతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ఇంకొందరైతే ఆయన వద్దకు వెళ్లి మరీ తమ విషెస్‌ తెలిపారు. కానీ కొరటాల మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం విశేషం. ఇక సైరా టీమ్‌కు ఇటీవల అల్లు అర్జున్- అల్లు అరవింద్‌లు పార్టీ ఇవ్వగా.. దానికి సుకుమార్, హరీశ్ శంకర్, త్రివిక్రమ్ వంటి స్టార్ డైరక్టర్లు వెళ్లగా.. కొరటాల మాత్రం కనిపించలేదు. అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ చిరుతో తన మూవీ గురించి కొరటాల ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో కొరటాల మౌనం వెనుక కారణమేంటన్న చర్చ ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతోంది. అలాగే మెగాస్టార్- కొరటాల సినిమా ఎంత వరకు వచ్చింది..? ఆ ప్రాజెక్ట్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుంది..? అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి.

Latest Articles