AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్: విడిపోయిన లవ్ జంట.. వెక్కివెక్కి ఏడ్చిన రాహుల్

అందరూ ఊహించినట్లుగానే బిగ్ బాస్ ఇంటి నుంచి ఈ వారం పునర్నవి ఎలిమినేట్ అయింది. టాస్క్‌ల్లో యాక్టివ్‌గా లేకపోయినా.. 11 వారాలపాటు బిగ్ ఇంట్లో బాగానే నెట్టుకొచ్చింది. పునర్నవి వెళిపోవడంతో ఆమె క్లోజ్ ఫ్రెండ్ అయిన రాహుల్ తట్టుకోలేకపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అయితే 11వ వారం నామినేషన్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్, మహేష్ విట్టాలు ఉన్నారు. శనివారం రోజు ఎపిసోడ్‌లో రాహుల్ సేవ్ కాగా.. రెండో కంటెస్టెంట్‌గా వరుణ్ కూడా సేఫ్ అయ్యాడు. ఇక మహేష్ […]

బిగ్ బాస్: విడిపోయిన లవ్ జంట.. వెక్కివెక్కి ఏడ్చిన రాహుల్
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 07, 2019 | 11:50 AM

Share

అందరూ ఊహించినట్లుగానే బిగ్ బాస్ ఇంటి నుంచి ఈ వారం పునర్నవి ఎలిమినేట్ అయింది. టాస్క్‌ల్లో యాక్టివ్‌గా లేకపోయినా.. 11 వారాలపాటు బిగ్ ఇంట్లో బాగానే నెట్టుకొచ్చింది. పునర్నవి వెళిపోవడంతో ఆమె క్లోజ్ ఫ్రెండ్ అయిన రాహుల్ తట్టుకోలేకపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అయితే 11వ వారం నామినేషన్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్, మహేష్ విట్టాలు ఉన్నారు. శనివారం రోజు ఎపిసోడ్‌లో రాహుల్ సేవ్ కాగా.. రెండో కంటెస్టెంట్‌గా వరుణ్ కూడా సేఫ్ అయ్యాడు. ఇక మహేష్ విట్టా, పునర్నవిలలో.. మహేష్ సేఫ్ అయ్యాడు.

హౌస్ నుంచి బయటకు వచ్చిన పునర్నవి.. స్టేజ్ పై ఫుల్ జోష్ ‌తో కనిపించింది. బిగ్ బాస్ హౌస్‌లో తన జర్నీని చూసిన పున్ను.. ఎంతో మురిసిపోయింది. కాని రాహుల్ మాత్రం పునర్నవి వెళిపోయిందని కంటతడి పెట్టుకున్నాడు. వితిక, శ్రీముఖి, వరుణ్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. పునర్నవి లేకపోవడం నాకు పెద్ద లోటు. ఆమె నన్ను చాలా బాగా చూసుకుంది అంటూ రాహుల్ ఎమోషన్ అయ్యాడు. ఇక ఫైనల్‌గా వెళ్లిపోమాకే సాంగ్‌తో ఈ ఇద్దరి బిగ్ బాస్ ప్రేమ ప్రయాణానికి ఎండ్ కార్డ్ వేశారు నాగార్జున.

చివరిసారి పునర్నవికి టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఇంటిలో ఉన్న వారిలో ఎవరికి హగ్ ఇస్తావు? ఎవరికి పంచ్ ఇస్తావు.? అని ప్రశ్నించారు. అందులో మహేష్, బాబా భాస్కర్‌కు పంచ్ ఇచ్చిన పునర్నవి… వితిక, వరుణ్, అలీకి మాత్రం హగ్ ఇచ్చింది. ఇక రాహుల్ ‘నా వేస్ట్ ఫెల్లో’ అంటూ బిగ్‌హగ్ ఇచ్చింది పున్ను. టాస్క్‌లపై దృష్టి పెట్టాలని.. ఓవర్ ఎక్సైట్ కావొద్దని రాహుల్‌కు సూచించింది. ఇక ఇంట్లో బాబా భాస్కర్ బానిసగా ఉండాలని, అలీ రెజా మాస్టర్‌గా ఉండాలని బిగ్ బాంబ్ వేసింది.

Follow Us
ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు.. ఈజీగా కమ్మగా ఈ లంచ్ చేసి పెట్టండి
ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు.. ఈజీగా కమ్మగా ఈ లంచ్ చేసి పెట్టండి
సుధీర్ పై సృష్టి చెత్త పని.. చప్పట్లు కొట్టి సంతోషపడిన శకుని..
సుధీర్ పై సృష్టి చెత్త పని.. చప్పట్లు కొట్టి సంతోషపడిన శకుని..
పెళ్లితోనే ఈ రాశుల వారి దశ తిరిగిపోతోంది.. అదృష్టం తలుపు తడుతుంది
పెళ్లితోనే ఈ రాశుల వారి దశ తిరిగిపోతోంది.. అదృష్టం తలుపు తడుతుంది
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?
చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?
చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?
స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే
స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే
ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్
ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్
కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్