AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కండిషన్లు పెడుతోన్న రాములమ్మ..!

లేడి అమితాబ్ విజయశాంతి దాదాపుగా 13 సంవత్సరాల తరువాత వెండి తెరపైన కనిపించబోతోంది. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ద్వారా విజయశాంతి టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో విజయశాంతి కనిపించనుంది. అయితే ఈ సినిమాపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయశాంతి.. గతంలోనూ ఓ సినిమా కోసం అనిల్ రావిపూడి తనను సంప్రదించారని.. కానీ ఈ సినిమాలో పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని, అందుకే ఒప్పుకున్నానని తెలిపింది. ఇక అనిల్ […]

కండిషన్లు పెడుతోన్న రాములమ్మ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 03, 2020 | 9:07 PM

Share

లేడి అమితాబ్ విజయశాంతి దాదాపుగా 13 సంవత్సరాల తరువాత వెండి తెరపైన కనిపించబోతోంది. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ద్వారా విజయశాంతి టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో విజయశాంతి కనిపించనుంది. అయితే ఈ సినిమాపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయశాంతి.. గతంలోనూ ఓ సినిమా కోసం అనిల్ రావిపూడి తనను సంప్రదించారని.. కానీ ఈ సినిమాలో పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని, అందుకే ఒప్పుకున్నానని తెలిపింది. ఇక అనిల్ రావిపూడి సైతం మాట్లాడుతూ.. ఈ పాత్రలో విజయశాంతిని తప్ప మరెవరినీ ఊహించుకోలేనని వెల్లడించారు. ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు కచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తోన్న విజయశాంతి.. ఇకపై వరుస సినిమాలను చేయాలని భావిస్తోందట. అయితే ఏదైనా సినిమా తను ఒప్పుకునేందుకు మాత్రం రెండు కండిషన్లు పెడుతోంది ఈ రాములమ్మ.

అందులో ఒకటి రెమ్యునరేషన్. పారితోషికం విషయంలో ఏ మాత్రం తగ్గనని విజయశాంతి చెబుతోందట. ఆమె పారితోషికం ఇప్పటి స్టార్ హీరోయిన్ల కంటే చాలా ఎక్కువని సమాచారం. అంతేకాదు ఏదో ఒక చిన్న పాత్ర ఇస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తుందట. అలాగే తల్లి పాత్రలు కూడా అన్ని చేయనని.. సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటేనే నటిస్తానని ఈ సీనియర్ హీరోయిన్ చెబుతోందట. ఇవి ఉంటేనే ఏదైనా ప్రాజెక్ట్‌కు ఓకే చెప్తానని ఆమె చెబుతోందట. కాగా అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రానికి కూడా విజయశాంతిని ఓకే చెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన తదుపరి చిత్రంగా ఎఫ్ 2 సీక్వెల్‌ను అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ మళ్లీ కలిసి నటించబోతున్నారని టాక్.

Follow Us
ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా..
ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా..
థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..
అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..
NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం
NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం
మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..
మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?
మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..
మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..
వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఇలా సింపుల్‌ మెరిపించండి
వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఇలా సింపుల్‌ మెరిపించండి
కిరోసిన్ నీలి రంగులో ఎందుకు ఉంటుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణం
కిరోసిన్ నీలి రంగులో ఎందుకు ఉంటుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణం
భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?