Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మా’ వివాదం : మొదలుంది..చివరేది..?

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌లో  గొడవలు నిన్న మొన్న పుట్టుకొచ్చినవి కావు. గతంలోనూ చాలాసార్లు ‘మా’ వివాదాలకు వేదికైంది. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా నటీనటుల మధ్య తారాస్థాయిలో మాటల యుద్దం నడిచింది. శివాజీరాజా, నరేశ్‌ ప్యానల్స్ పరస్పరం ఢీకొన్నాయి. ఫలితాల్లో నరేశ్‌ వర్గానికి ఎక్కువ పదవులు దక్కాయి. దీంతో అధ్యక్ష పదవి నరేశ్‌ చేపట్టగా… జనరల్‌ సెక్రటరీ పదవి జీవిత చేపట్టింది. ఎగ్జిక్యూటీవ్ జనరల్ సెక్రటరీగా హీరో రాజశేఖర్ ఎన్నికయ్యారు. కానీ పగ్గాలు చేపట్టిన […]

'మా' వివాదం : మొదలుంది..చివరేది..?
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 03, 2020 | 8:28 PM

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌లో  గొడవలు నిన్న మొన్న పుట్టుకొచ్చినవి కావు. గతంలోనూ చాలాసార్లు ‘మా’ వివాదాలకు వేదికైంది. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా నటీనటుల మధ్య తారాస్థాయిలో మాటల యుద్దం నడిచింది. శివాజీరాజా, నరేశ్‌ ప్యానల్స్ పరస్పరం ఢీకొన్నాయి. ఫలితాల్లో నరేశ్‌ వర్గానికి ఎక్కువ పదవులు దక్కాయి. దీంతో అధ్యక్ష పదవి నరేశ్‌ చేపట్టగా… జనరల్‌ సెక్రటరీ పదవి జీవిత చేపట్టింది. ఎగ్జిక్యూటీవ్ జనరల్ సెక్రటరీగా హీరో రాజశేఖర్ ఎన్నికయ్యారు.

కానీ పగ్గాలు చేపట్టిన తర్వాత నరేశ్‌ ప్యానల్‌లోనే లుకలుకలు మొదలయ్యాయి. అది కాస్తా నరేశ్‌ వర్సెస్‌ జీవిత వర్గాలుగా మారిపోయింది. ఒక దశలో కార్యవర్గం రెండుగా చీలిపోతుందా అనిపించింది.  ఎన్నికల తర్వాత ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ లేకుండా అక్టోబర్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. నరేశ్‌ పనితీరుపై, నిధుల విషయంలో జీవితా రాజశేఖర్ వర్గం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. నరేష్‌ని కాదని.. వీరిద్దరూ ఈసీ సభ్యులకు సందేశాలు పంపడంతో తీవ్ర దుమారానికి కారణమైంది.

అయితే ఇది ‘మా’ ఆత్మీయ సమావేశం అంటూ జీవిత రాజశేఖర్‌ చెప్పుకొచ్చారు. ఈ మీటింగ్‌కు దాదాపు 200మంది వచ్చారు. ఈ సమావేశంలో రెండువర్గాల ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. మరోవైపు – ఈ మీటింగ్‌పై నరేష్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో ఏడాదికోసారి జనరల్‌ బాడీ మీటింగ్‌ జరుగుతుందని, 25 ఏళ్లలో ఎప్పుడూ లేని ఇలాంటి ఎమర్జెన్సీ మీటింగ్‌ జరగలేదన్నారు. అసలు తాను నిర్వహించాల్సిన మీటింగ్‌కు వేరొకరు కాల్‌ఫర్ చేయడం ఏంటని  ప్రశ్నించారు. మొత్తంగా మాలో అంతర్గత కుమ్ములాటలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా అయ్యాయి.

ఇది ఇలా ఉంటే.. అంతకుముందు ఇద్దరు సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో మరో వివాదం రేగింది. ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న హీరో రాజశేఖర్‌, ‘మా’ సభ్యునిగా ఉన్న బెనర్జీకి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు నరేష్‌. దీంతో కంగుతున్న ‘మా’ జనరల్‌ సెక్రటరీ జీవితా రాజశేఖర్‌, ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌తో పాటు మరికొందరు సభ్యులు కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌ 10న ఈ మీటింగ్‌ కండక్ట్‌ చేశారు. అధ్యక్షుడు నరేష్‌ హైదరాబాద్‌లోని లేని సమయంలో ఇది ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని నరేష్‌కి సమాచారం ఇచ్చినా తాను రాలేనని తెలిపారు. అంతేకాదు ఈ మీటింగ్‌ వచ్చే వారం ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. అయితే కోరం సభ్యులు ఉన్నారని జీవిత మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని రిజల్యూషన్స్‌ పాస్‌ చేశారు. అయితే ఈ రిజల్యూషన్స్‌ చెల్లవని ఇద్దరు సభ్యులు సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇలా చెప్పుకుంటూ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు వివాదాలు కొత్తేంకాదు. ఒకరకంగా చెప్పాలంటే వివాదాలతోనే ‘మా’  సహవాసం చేస్తున్నట్లు అనిపిస్తోంది. మరి కొత్త సంవత్సరంలో అయినా విభేదాలు మరచి ‘మా’  అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని ఆశిద్దాం.