రూమర్లకు చెక్.. ‘పొన్నియన్ సెల్వన్’ ఫస్ట్‌లుక్

లెజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీపై అప్పుడెప్పుడే అధికారిక ప్రకటన చేశారు. అయితే కారణాలు తెలీదు గానీ.. షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దానికి తోడు ఆ మధ్యన మణిరత్నం ఆరోగ్యం కూడా బాలేకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందన్న వార్తలు వినిపించాయి. కానీ తాజాగా వాటన్నింటికి చెక్ పెట్టింది మణి టీమ్. […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:11 pm, Fri, 3 January 20
రూమర్లకు చెక్.. 'పొన్నియన్ సెల్వన్' ఫస్ట్‌లుక్

లెజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీపై అప్పుడెప్పుడే అధికారిక ప్రకటన చేశారు. అయితే కారణాలు తెలీదు గానీ.. షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దానికి తోడు ఆ మధ్యన మణిరత్నం ఆరోగ్యం కూడా బాలేకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందన్న వార్తలు వినిపించాయి. కానీ తాజాగా వాటన్నింటికి చెక్ పెట్టింది మణి టీమ్. జనవరి 2న ‘పొన్నియన్ సెల్వన్’ ఫస్ట్‌లుక్‌ను విడుదల అయ్యింది.

కాగా చోళ రాజు అయిన రాజా రాజా చోళన్ 1 జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, కీర్తి సురేష్, అమలా పాల్, జ్యోతిక తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. తమిళనాడు, థాయ్‌లాండ్‌లోని పలు ప్రదేశాల్లో ఈ మూవీ చిత్రీకరణ జరగనుంది. అన్ని కుదిరితే ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీకి పాటల రచయితగా ప్రముఖ రచయిత వైరముత్తును తీసుకుంది చిత్ర యూనిట్. అయితే మీటూ ఉద్యమంలో వైరముత్తు పేరు రావడంతో.. ఆ ప్రాజెక్ట్‌ నుంచి ఆయనను తప్పించినట్లు ఆ మధ్యన గాసిప్‌లు వచ్చాయి. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్లలోనూ వైరముత్తు పేరు లేకపోవడంతో.. ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది.