‘పింక్’ రీమేక్.. పవన్‌ కోసం స్క్రిప్ట్‌లో మార్పులు..!

పింక్ రీమేక్ ద్వారా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల వలన దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ రీమేక్‌లో పలు మార్పులు చేయాలని నిర్మాత దిల్ రాజు దర్శకుడు వేణు శ్రీరామ్‌కు సూచించారట. […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:36 pm, Fri, 3 January 20
'పింక్' రీమేక్.. పవన్‌ కోసం స్క్రిప్ట్‌లో మార్పులు..!

పింక్ రీమేక్ ద్వారా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల వలన దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ రీమేక్‌లో పలు మార్పులు చేయాలని నిర్మాత దిల్ రాజు దర్శకుడు వేణు శ్రీరామ్‌కు సూచించారట. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా యాడ్ చేయాలని చెప్పారట. ఇక పవన్ ఫ్యాన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని హీరో ఎలివేషన్ సీన్లను యాడ్ చేయాలని ఆయన అన్నారట. ఈ క్రమంలో వేణు శ్రీరామ్ ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా బాలీవుడ్‌లో పింక్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటించారు. ఈ చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేశారు. అక్కడ అజిత్‌ హీరోయిజానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. ఇక ఇప్పుడు తెలుగులో కూడా అలాంటి మార్పులే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో అంజలి, నివేథా థామస్, మల్లేశం ఫేమ్ అనన్య కీలక పాత్రలలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనుండగా.. సమ్మర్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.