Liger: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న రౌడీ .. 24 గంటల్లో 16 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకున్న లైగర్..

టాలీవుడ్‌ రౌడీ విజయ్ దేవరకొండ, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'లైగర్‌'. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా

Liger: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న రౌడీ .. 24 గంటల్లో 16 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకున్న లైగర్..
Liger
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2022 | 11:25 AM

టాలీవుడ్‌ రౌడీ విజయ్ దేవరకొండ, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘లైగర్‌’. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా గత మూడు రోజుల నుంచి వరుసగా అప్డేట్‌ ఇస్తోన్న ‘లైగర్‌’ చిత్రబృందం న్యూఇయర్ స్పెషల్ గిఫ్ట్ గా నిన్న ఓ గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండను సరికొత్త అవతారంలో చూపిస్తూ రౌడీ అభిమానులకు సరికొత్త ట్రీట్‌ ఇచ్చాడు పూరీ. దీంతో ఈ గ్లింప్స్ యూట్యూట్‌లో రికార్డులు సృష్టిస్తోంది. రిలీజైనప్పటి నుంచి యూట్యూబ్లో ట్రెండింగ్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న ‘లైగర్‌’ గ్లింప్స్‌కు ఇప్పటివరకు 16 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ నేపథ్యంలో 24 గంటల్లో యూట్యూబ్‌లో ఎక్కువ వ్యూస్‌ దక్కించుకున్న టీజర్‌గా రికార్డు సృష్టించింది.

కాగా సినిమాలో కండలు తిరిగిన దేహంతో డిఫరెంట్ మెకోవర్.. యాటిట్యూడ్‏తో కనిపించాడు విజయ్. ముంబై వీధుల్లో చాయ్ వాలాగా జీవించే వ్యక్తి బాక్సర్‏గా ఎలా ఎదిగాడనేది చూపించారు పూరి. మిక్స్‌డ్‌ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో హై వోల్డేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‏తో ‘లైగర్’ను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ద్వారా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్‏ను టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు పూరి. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also read:

Happy New Year 2022: టీ20 ప్రపంచకప్‌.. ఆసియాకప్‌.. ఈ ఏడాది టీమిండియా ఆడే మ్యాచ్ లివే..

Happy New Year 2022: అందుకే 2021కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. దియా ఎమోషనల్‌ పోస్ట్‌..

Smriti Mandhana: మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం రేసులో స్మృతి మంధాన.. లిస్ట్‌లో ఎవరున్నారంటే..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!