AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy New Year 2022: అందుకే 2021కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. దియా ఎమోషనల్‌ పోస్ట్‌..

మొదటి వైవాహిక బంధం మిగిల్చిన చేదు అనుభవాన్ని మర్చిపోతూ ఈ ఏడాది రెండో వివాహం చేసుకుంది బాలీవుడ్‌ నటి దియా మీర్జా. ఈ ఏడాది ఫిబ్రవరిలో

Happy New Year 2022: అందుకే 2021కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. దియా ఎమోషనల్‌ పోస్ట్‌..
Dia Mirza
Basha Shek
|

Updated on: Jan 01, 2022 | 10:19 AM

Share

మొదటి వైవాహిక బంధం మిగిల్చిన చేదు అనుభవాన్ని మర్చిపోతూ ఈ ఏడాది రెండో వివాహం చేసుకుంది బాలీవుడ్‌ నటి దియా మీర్జా. ఈ ఏడాది ఫిబ్రవరిలో వ్యాపారవేత్త వైభవ్‌ రేఖితో ఏడడుగులు నడిచిందామె. అదేవిధంగా మే 15న అవ్యాన్‌ అనే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే దియా నెలలు తిరగకుండానే ఆమె ప్రసవించడంపై కొందరు నెటిజన్లు నోరుపారేసుకున్నారు. ‘ దియా పెళ్లికి ముందే గర్భం ధరించింది, అందుకే హడావిడిగా పెళ్లి చేసుకుందని వ్యాఖ్యలు చేశారు. అయితే అమ్మగా ప్రమోషన్‌ పొందిన తర్వాత తన ప్రసవానికి సంబంధించి అసలు విషయాన్ని బయటపెట్టిందీ అందాల తార. అనారోగ్య పరిస్థితులతో పాటు గర్భధారణ సమయంలో తలెత్తిన కొన్ని సమస్యల వల్లే నెలలు నిండక ముందే అవ్యాన్‌ జన్మించాడని క్లారిటీ ఇచ్చింది దియా. గర్భధారణ సమయంలో అపెండెక్టమీ తీవ్రమైన బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌కు దారి తీసిందని, అందుకే నియోనాటల్ ఐసీయూలో సిజేరియన్‌ ద్వారా అవ్యాన్‌ను ప్రసవించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

అమ్మగా మార్చినందుకు కృతజ్ఞతలు.. ఈక్రమంలో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్‌ పెట్టింది దియా. ఈ ఏడాది తన జీవితంలో ఎదురైన కష్టాలు, బాధలు, వాటికి సంబంధించి కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. ‘నన్ను తల్లిగా మార్చిన ఈ ఏడాదికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం అంతులేని ఆనందాన్ని పొందాను. అదేవిధంగా నా కుమారుడిని నెలలను నిండక ముందే పుట్టించి ఆ దేవుడు కొన్ని పరీక్షలు పెట్టాడు. కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నాను. అవి చాలా గొప్ప పాఠాలు. ఈ ఏడాది కష్టతరమైన కాలాన్ని అనుభవించాను’ అని తన అనుభవాలను పంచుకుంది దియా.