Payal Rajput dance Video: రారా సామీ పాటకు పాయల్‌ డాన్స్‌.. సోషల్‌మీడియా షేక్‌..! (వీడియో)

Payal Rajput dance Video: రారా సామీ పాటకు పాయల్‌ డాన్స్‌.. సోషల్‌మీడియా షేక్‌..! (వీడియో)

Anil kumar poka

|

Updated on: Jan 01, 2022 | 9:45 AM

ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియానే కనిపిస్తోంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో మూడవ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బ్రేక్‌ చేస్తోంది.


ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియానే కనిపిస్తోంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో మూడవ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బ్రేక్‌ చేస్తోంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకొని దూసుకుపోతోందీ సినిమా. ఇక ఈ సినిమాకు పాటలు మరో హైలెట్‌గా చెప్పొచ్చు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సోషల్‌ మీడియాలో వేదికగా పుష్ప సినిమాలోని పాటలకు సంబంధించిన రీల్స్‌ తెగ సండడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇందులోని ‘రారా సామీ’ పాటకు అమ్మాయిలు రీల్స్‌తో హోరెత్తిస్తున్నారు.

అయితే ఈ పాట కేవలం సామాన్యులనే కాకుండా సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలువురు నటీమణులు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా ‘రారా సామీ’ పాటకు స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఫారిన్‌ ట్రిప్‌లో ఉన్న పాయల్‌ నగర వీధుల్లో ఈ పాటకు వేసిస స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి.
గోల్డ్‌ కలర్‌ ట్రెండీ డ్రస్‌లో వయ్యారంగా పాటకు కాలు కదిపిన పాయల్‌ను చూసిన కుర్రకారు ఫిదా అవుతున్నారు. ‘ఈ పాట పాడిన సింగర్‌ వాయిస్‌ చాలా బాగుంది’ అంటూ పాయల్‌ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది. కేవలం పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోకు లక్షన్నర లైక్‌లు రావడం విశేషం. మరి పాయల్‌ డ్యాన్స్‌ను మీరూ చూసేయండి..