Bhola Shankar: మెగా ట్రీట్ అదిరిపోయిందిగా.. భోళా శంకర్ మోషన్ పోస్టర్ రిలీజ్.. ఊర మాస్ లుక్‌లో మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. ఓకే నెలలో నాలుగు చిత్రాలను పట్టాలెక్కించి బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. ఓకే నెలలో నాలుగు చిత్రాలను పట్టాలెక్కించి బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నారు. ఇప్పటికే ఆచార్య సినిమాను కంప్లీట్ చేసిన చిరు.. ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ చిత్రాన్ని తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు తెలుగు రీమేక్. చెల్లెల్లి సెంటిమెంట్ ప్రధానంగా ఈ స్టోరీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. తాజాగా న్యూఇయర్ కానుకగా భోళా శంకర్ నుంచి చిరంజీవి మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.
మోషన్ పోస్టర్లో చిరంజీవి ఊర మాస్ లుక్‌లో అదరగొట్టారు. చేతికి కడియం, తాయెత్తులు కట్టుకుని ఉన్న చిరు లుక్ ఆకట్టుకుంటుంది. రివెంజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడిగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది. అలాగే ఇందులో కీర్తి సురేష్ భర్తగా యంగ్ హీరో నాగశౌర్య నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిరు రెండు షేడ్స్‌లో కనిపించనున్నారు.
Also Read: Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‌తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..
Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!
Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..