Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..

Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..
Deepthi

యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్ జశ్వంత్‏తో విడిపోతున్నట్లు అతని ప్రేయసి దీప్తి సునయన తెల్చీ చెప్పేసింది. గత కొద్ది రోజులుగా

Rajitha Chanti

|

Jan 01, 2022 | 8:33 AM

యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్ జశ్వంత్‏తో విడిపోతున్నట్లు అతని ప్రేయసి దీప్తి సునయన తెల్చీ చెప్పేసింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలు నిజమేనంటూ తెల్చేసింది దీప్తి.. తామిద్దరం విడిపోతున్నామంటూ తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేసింది దీప్తి. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

“నా శ్రేయోభిలాషులు మరియు స్నేహితులందరికీ ఎంతో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. నేను, షణ్ముఖ్ పరస్పరం మా వ్యక్తిగత జీవితాలలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఈ ఐదు సంవత్సరాలు మేము సంతోషంగా ఉన్నాం. ప్రేమ, ఎదుగుల సమయంలో మాలోని రాక్షాసులతో పోరాటం చాలా కష్టం. మీరందరు కోరుకున్నట్టే మేమిద్దరం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా కాలంగా జరుగుతుంది. కానీ సోషల్ మీడియాలో కనిపించినంత సులభంగా మాత్రం కాదు. మేమిద్దరం కలిసి ఉండేందుకు ప్రయత్నించాము. కానీ జీవితానికి అవసరమైన వాటిని విస్మరించాం. మా మార్గాలు వేరని తెలుసుకున్నాం. అందుకే మా దారులలో వెళ్లేందుకు ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీరు మాకు అండగా ఉండండి. అలాగే మా ప్రైవసీకి భంగం కలిగించరని కోరుకుంటున్నాం.” అంటూ సుదీర్ఘ పోస్ట్ చేసింది దీప్తి సునయన.

అయితే బిగ్‏బాస్ షోలోకి రాకముందే షణ్ముఖ్ దీప్తి ప్రేమలో ఉన్నారు. కానీ బిగ్‏బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత షణ్ముఖ్ సిరితో ఎక్కువగా కనెక్ట్ అయ్యాడు. బిగ్‏బాస్ జర్నీలో వీరిద్దరి శ్రుతిమించిన ప్రవర్తన, హగ్గులు, ముద్దులు ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. ఇరువురి కుటుంబసభ్యులు వచ్చి హగ్గులు తగ్గించండి అని చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. అలాగే ప్రతిసారి ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ చెప్పడంతో వీరిద్దరిపై మరింత నెగిటివిటి పెరిగింది. ఇవే కాకుండా.. ప్రతిసారి సిరిని షణ్ముఖ్ కంట్రోల్ చేయడం.. ఆమె ఎవరితో మాట్లాడిన సహించలేకపోవడం.. చూపులతోనే సిరిని కంట్రోల్ చేయడం వంటివి షణ్ముఖ్ ఇమేజ్‏ను భారీగా డ్యామేజ్ చేశాయి. దీంతో టైటిల్ రేసులో ముందంజలో ఉన్న షణ్ముఖ్ చివరిగా రన్నరప్‏గా మిగిలాడు. కాగా బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం.. షణ్ముఖ్, దీప్తి విడిపోయారంటూ నెట్టింట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై షణ్ముఖ్ స్పందిస్తూ… ప్రస్తుతం దీప్తి తనపై అలిగి బ్లాక్ చేసిందని.. త్వరలోనే హైదారాబాద్ వెళ్లి కలుస్తానంటూ చెప్పుకొచ్చాడు. అయితే మరిన్ని రూమర్లకు తావులేకుండా దీప్తి తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టుతో వీరిద్దరి బంధానికి ముగింపు పలికినట్లు చెప్పేసింది.

Also Read: Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu