AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy New Year 2022: టీ20 ప్రపంచకప్‌.. ఆసియాకప్‌.. ఈ ఏడాది టీమిండియా ఆడే మ్యాచ్ లివే..

మరుపురాని విజయాలు, కొన్ని చేదు జ్ఞాపకాలతో  గత ఏడాదిని అద్భుతంగా ముగించింది టీమిండియా. టెస్ట్‌ క్రికెట్ విషయానికొస్తే..  2021  ప్రారంభంలో ఆసీస్‌ను వారి గడ్డపైనే ఓడించి శుభారంభం చేసిన భారత జట్టు.. ఇంగ్లండ్‌ను కూడా

Happy New Year 2022: టీ20 ప్రపంచకప్‌.. ఆసియాకప్‌.. ఈ ఏడాది టీమిండియా ఆడే మ్యాచ్ లివే..
Basha Shek
|

Updated on: Jan 01, 2022 | 11:02 AM

Share

మరుపురాని విజయాలు, కొన్ని చేదు జ్ఞాపకాలతో  గత ఏడాదిని అద్భుతంగా ముగించింది టీమిండియా. టెస్ట్‌ క్రికెట్ విషయానికొస్తే..  2021  ప్రారంభంలో ఆసీస్‌ను వారి గడ్డపైనే ఓడించి శుభారంభం చేసిన భారత జట్టు.. ఇంగ్లండ్‌ను కూడా వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది. తాజాగా సెంచూరియన్‌ టెస్ట్‌ విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. ఇక మధ్యలో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ ఓటమి, టీ20 ప్రపంచకప్‌ వైఫల్యం క్రికెట్ అభిమానులను బాగా బాధ పెట్టాయి. ఈ క్రమంలో 2022లో కూడా భారతజట్టు బిజీబిజీగా గడపనుంది. అందులో ప్రతిష్ఠాత్మక టీ 20 ప్రపంచకప్‌, ఆసియా కప్‌ కూడా ఉన్నాయి. కరోనా వల్ల ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుంటే ఈ మ్యాచులన్నీ సవ్యంగా జరుగుతాయి. మరి ఈ ఏడాది టీమిండియా ఆడే సిరీస్‌లు, మ్యాచ్‌ల వివరాలేంటో ఒకసారి చూద్దాం రండి.

దక్షిణాఫ్రికా పర్యటన జనవరి 3-7: రెండో టెస్టు (జోహన్నెస్‌బర్గ్‌) జనవరి 11-15: మూడో టెస్టు( కేప్‌టౌన్)

జనవరి 19: మొదటి వన్డే(పార్ల్‌) జనవరి 21: రెండో వన్డే(పార్ల్‌) జనవరి 23: మూడో వన్డే(కేప్‌టౌన్‌)

స్వదేశంలో వెస్టిండీస్‌ టూర్‌ ఫిబ్రవరి 6: మొదటి వన్డే(అహ్మదాబాద్‌) ఫిబ్రవరి 9: రెండో వన్డే(జైపూర్‌) ఫిబ్రవరి 12: మూడో వన్డే(కోల్‌కతా)

ఫిబ్రవరి 15: తొలి టీ-20(కటక్‌) ఫిబ్రవరి 18: రెండో టీ-20(విశాఖపట్నం) ఫిబ్రవరి 20: మూడో టీ- 20(తిరువనంతపురం)

శ్రీలంక టూర్‌ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 25- మార్చి 1: తొలి టెస్టు(చెన్నై) మార్చి5-9: రెండో టెస్టు(మొహలీ)

మార్చి 13: తొలి టీ20(మొహలీ) మార్చి 15: రెండో టీ20(ధర్మశాల) మార్చి 18: మూడో టీ20( లక్నో)

*ఏప్రిల్‌, మే నెలల్లో ఐపీఎల్‌ 2022 సీజన్‌ జరగనుంది.

ఇండియాలో సౌతాఫ్రికా టూర్‌ జూన్‌ 9: తొలి టీ20(చెన్నై) జూన్‌ 12: రెండో టీ20(బెంగళూరు) జూన్‌ 14: మూడో ఈ20(నాగ్‌పూర్‌) జూన్‌ 15: నాలుగో టీ20(రాజ్‌కోట్‌) జూన్‌ 19: ఐదో టీ20(ఢిల్లీ)

ఇంగ్లండ్‌లో టీమిండియా టూర్‌.. జూలై 1-5: ఐదో టెస్టు( బర్మింగ్‌హామ్‌)

జూలై 7: తొలి టీ20(సౌతాప్టంన్) జూలై 9: రెండో టీ20(బర్మింగ్‌హమ్‌) జూలై 10: మూడో టీ20(నాటింగ్‌హమ్‌)

జూలై 12: తొలి వన్డే(ఓవల్‌) జూలై 14: రెండో వన్డే(లార్డ్స్‌) జూలై 17: మూడో వన్డే(మాంచెస్టర్‌)

*ఇంగ్లండ్ టూర్‌ తర్వాత జూలై- ఆగస్టులో టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. అక్కడ మూడు టీ20లు.. మూడు వన్డేలు ఆడనుంది. దీనికి సంబంధించి షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉంది. *సెప్టెంబర్‌లో శ్రీలంక వేదికగా ఆసియాకప్‌ 2022 జరగనుంది. * ఆ తర్వాత సెప్టెంబర్‌- నవంబర్‌ నెలలో ఆస్ట్రేలియా ఇండియాలో పర్యటించనుంది . సుమారు 60 రోజుల పాటు సాగే ఈ టూర్లో ఆస్ట్రేలియా నాలుగు టెస్టులు.. మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. *అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 11 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. * దీని నవంబర్‌- డిసెంబర్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టనుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. దీని తర్వాత టీమిండియా శ్రీలంకతో స్వదేశంలో ఐదు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఈ ఏడాదికి ఇదే ఆఖరి సిరీస్‌. అయితే వీటికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేయాల్సి ఉంది.