Smriti Mandhana: మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం రేసులో స్మృతి మంధాన.. లిస్ట్‌లో ఎవరున్నారంటే..

ఆట పరంగా భారత మహిళల జట్టుకు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. విదేశాలతో పాటు స్వదేశంలోనూ పరాజయాలు ఎదుర్కొంది. అయితే వ్యక్తిగతంగా చూస్తే

Smriti Mandhana: మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం రేసులో స్మృతి మంధాన.. లిస్ట్‌లో ఎవరున్నారంటే..
Follow us

|

Updated on: Jan 01, 2022 | 9:42 AM

ఆట పరంగా భారత మహిళల జట్టుకు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. విదేశాలతో పాటు స్వదేశంలోనూ పరాజయాలు ఎదుర్కొంది. అయితే వ్యక్తిగతంగా చూస్తే మాత్రం టీమిండియా సభ్యురాలు స్మృతి మంధానకు ఈ ఏడాది మరో మైలురాయి అని చెప్పవచ్చు. ఆస్ట్రేలియాతో జరిగిన గులాబీ టెస్ట్‌ (డేనైట్‌)లో సెంచరీ(127 పరుగులు) సాధించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన ఈ టీమిండియా ఓపెనర్‌..స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అమోఘంగా రాణించింది. ఆతర్వాత ఇంగ్లండ్‌ పర్యటనలో ఆతిథ్య జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేసింది. తద్వారా మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర వహించింది. ఈక్రమంలో తన అద్భుతమైన ఆటతీరుకు గుర్తింపుగా ‘విమెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ‘ పురస్కారానికి నామినేట్‌ అయింది స్మృతి. అందులోనూ.. ఓవరాల్‌గా ఈ ఏడాది స్మృతి ఆటతీరును ఒకసారి పరిశీలిస్తే.. మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 38.86 సగటుతో 855 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇందుకే ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ‘రాచెల్‌ హేహో ఫ్లింట్‌ ట్రోఫీ’ పేరిట ఇచ్చే ఈ పురస్కారం కోసం మంధానతో సహా నలుగురు మహిళా క్రికెటర్లను ఎంపిక చేసింది ఐసీసీ. ఈ జాబితాలో టామీ బీమాంట్‌ (ఇంగ్లండ్‌), లీజెల్లీ లీ (దక్షిణాఫ్రికా), గాబీ లూయిస్‌ కూడా ఉన్నారు. ఈ అవార్డుతో పాటు ఈ ఏడాది టీ20 మేటి మహిళా క్రికెటర్‌ అవార్డు రేసులోనూ నిలిచింది స్మృతి. ఇక ‘మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు కోసం ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్, పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్, ఫాస్ట్ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది పోటీ పడుతున్నారు.

Also Read:

IND VS SA: మొదటి టెస్ట్‌ విజయానందంలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్‌.. జరిమానాతో పాటు..

Fact Check: ఉచితంగా ఒమిక్రాన్‌ నిర్ధారణ పరీక్ష.. కేంద్ర హోం శాఖ ఏం చెబుతోందంటే..

Fact Check: వాట్సప్‌లో న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. అసలు విషయమేమిటంటే..