IND VS SA: మొదటి టెస్ట్‌ విజయానందంలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్‌.. జరిమానాతో పాటు..

సెంచూరియన్‌ వేదికగా దక్షిణఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా కఠినమైన సఫారీ పర్యటనలో శుభారంభం

IND VS SA: మొదటి టెస్ట్‌ విజయానందంలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్‌.. జరిమానాతో పాటు..
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2022 | 9:13 AM

సెంచూరియన్‌ వేదికగా దక్షిణఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా కఠినమైన సఫారీ పర్యటనలో శుభారంభం అందుకుంది. మూడు టెస్ట్‌ల మ్యాచ్‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. అదేవిధంగా సెంచూరియన్‌ మైదానంలో టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఈ విజయానందంలో ఉన్న టీమిండియాకు ఐసీసీ గట్టి షాక్‌ ఇచ్చింది. మొదటి టెస్టులో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసిందన్న కారణంతో టీమిండియా మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధించింది. ఈ జరిమానాతో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2022-23 పాయింట్ల పట్టికలో టీమిండియాకు ఒక పాయింట్‌ కోత పడనుంది.

డబ్ల్యూటీసీ పాయిం ట్ల పట్టికలోనూ.. ఐసీసీ ప్రవర్తనా నియమావళి 2.22 ప్రకారం సెంచూరియన్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయలేకపోయింది. దీని కారణంగా టీమిండియాతో పాటు సహాయక సిబ్బందికి మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. దీంతోపాటు ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం 16.11 ప్రకారం.. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా టీమిండియాకు ఐసీసీ వరల్డ్‌టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2022-23లో ఒక పాయింట్‌ కోత పడింది. కాగా ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. ఇక సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా.. జనవరి 3 నుంచి జోహెన్నెస్‌బర్గ్‌ వేదికగా రెండో టెస్టు ఆడనుంది.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?