Saindhav movie: వెంకీ కొత్త సినిమా వచ్చేది అప్పుడే.. సైంధవ్‌ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్‌..

తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో వెంకీ సంక్రాతి బరిలోకి దిగనున్నారన్నమాట. ఇదిలా ఉంటే ఇప్పటికే సంక్రాంతికి పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఇప్పుడు వెంకీ వస్తుండడంతో మరింత ఆసక్తిగా మారింది. ఇప్పటికే సంక్రాంతి...

Saindhav movie: వెంకీ కొత్త సినిమా వచ్చేది అప్పుడే.. సైంధవ్‌ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్‌..
Saindhav Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 06, 2023 | 9:28 AM

సీనియర్ హీరో వెంకటేష్‌ నటించిన తాజా చిత్రం సైంధవ్‌. వెంకీ 75వ చిత్రంతా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్స్‌ను సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.

ఇక తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో వెంకీ సంక్రాతి బరిలోకి దిగనున్నారన్నమాట. ఇదిలా ఉంటే ఇప్పటికే సంక్రాంతికి పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఇప్పుడు వెంకీ వస్తుండడంతో మరింత ఆసక్తిగా మారింది. ఇప్పటికే సంక్రాంతి బరిలో.. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, రవితేజ ఈగిల్‌తో పాటు రజనీకాంత్‌ లాల్‌ సలాం మూవీలు ఉన్నాయి.

ఇప్పుడు వెంకీ కూడా సంక్రాంతికే వస్తుండడంతో పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే నిజానికి సైంధవ్‌ మూవీ క్రిస్మస్‌ కానుకగా విడుదల కావాల్సి ఉండేది. అయితే సినిమాను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న సలార్‌ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో సైంధవ్‌ విడుదలను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. సలార్‌ రాకతో సైంధవ్‌ మూడు వారాలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. జనవరి 13వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరి ఈసారి సంక్రాంతి బరిలో దిగుతోన్న వెంకీ మామ ఎలాంటి హిట్‌ను అందుకుంటారో చూడాలి.

సైంధవ్ మూవీ టీజర్…

ఇదిలా ఉంటే సైంధవ్‌ మూవీలో ఆర్య‌, శ్ర‌ద్ధాశ్రీనాథ్‌, రుహాణిశ‌ర్మ, ఆండ్రియాతో పాటు బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ కీల‌క పాత్ర‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగుతోపాటు దక్షిణాదికి చెందిన అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు దసరా మూవీకి సంగీతం అందించిన నారాయణ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, వెంకట్‌ బోయనపల్లి చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విధితమే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు