F3 Movie: సమ్మర్‌ సందడికి ముస్తాబైన ఎఫ్‌3.. మోస్ట్‌ అవైటెడ్‌ ఫన్‌ ఫ్రాంఛైజీ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు..

విక్టరీ వెంకటేష్ (Venkatesh ).. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ఎఫ్ 3 . వరుణ్‌ సరసన మెహ్రీన్‌, వెంకీ సరసన తమన్నా సందడి చేయనున్నారు.

F3 Movie: సమ్మర్‌ సందడికి ముస్తాబైన ఎఫ్‌3.. మోస్ట్‌ అవైటెడ్‌ ఫన్‌ ఫ్రాంఛైజీ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు..
F3
Follow us
Basha Shek

|

Updated on: Feb 14, 2022 | 10:43 AM

విక్టరీ వెంకటేష్ (Venkatesh ).. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ఎఫ్ 3 . వరుణ్‌ సరసన మెహ్రీన్‌, వెంకీ సరసన తమన్నా సందడి చేయనున్నారు. గతంలో వచ్చిన సూపర్ హిట్‌ సినిమా ఎఫ్‌2కు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన అనిల్‌ రావిపూడినే దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ ఈ కామెడీ ఎంటర్‌ టైనర్‌ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్‌ ఎఫ్ 3 పై అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు దర్శక నిర్మాతలు.

ఫన్ పిక్నిక్ కు రెడీగా ఉండండి..

వాలంటైన్స్‌ డే సందర్భంగా F3 రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసింది చిత్రబృందం. మే27న ప్రపంచవ్యాప్తంగా తమ సినిమాను విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ‘ పిల్లలు పరీక్షలు ముగించుకోండి. పెద్దలు సమ్మర్‌ సందడికి తయారు కండి. ఫన్‌ పిక్నిక్‌కి డేట్‌ ఫిక్స్‌ చేశాం. ఎంతగానో ఎదురుచూస్తోన్న ఫన్‌ ఫ్రాంఛైజీ విడుదల తేదీలో ఏ మార్పు ఉండదు’ అంటూ ఎఫ్‌3 కొత్త పోస్టర్‌ను పంచుకుంది. కాగా ఈసినిమాలో నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ ప్రధానపాత్రలు పోషించనున్నారు. సినిమాకు మరింత గ్లామర్‌ అద్దేందుకు తమన్నా, మెహరీన్‌లకు తోడు సోనాల్ చౌహాన్‌ ను కూడా రంగంలోకి దింపుతున్నారు.

Also Read:Ipl 2022 Auction: యశ్‌.. కంగారు పడకు.. ఈసారి నేను క్రీజులోనే ఉన్నాను.. అశ్విన్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికిన బట్లర్‌..

Pulwama Attack: ప్రేమికుల రోజున పాక్‌ ఉగ్రమూకల ఘాతుకం.. పుల్వామా నెత్తుటి మరకకు మూడేళ్లు.. అమరులకు నివాళి అర్పిస్తోన్న యావత్‌ దేశం..

Karnataka Hijab Row: కర్ణాటకలో నేటి నుంచి తెరచుకోనున్న పాఠశాలలు.. కళాశాలలు, యూనివర్సిటీల రీఓపెనింగ్‌పై ఇంకా వీడని సందిగ్ధత..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!