Valentine’s Day 2022: ఈ ఏడాది వెండితెరపై ప్రేమను పంచేందుకు వస్తోన్న సినిమాలివే..

Valentine’s Day 2022: ఈ ఏడాది వెండితెరపై ప్రేమను పంచేందుకు వస్తోన్న సినిమాలివే..

నిజ జీవితంలో కొన్ని ప్రేమకథలు విఫలమైనా సిల్వర్‌ స్ర్కీన్‌పై మాత్రం సూపర్‌ హిట్‌ అవుతుంటాయి. అందుకే సినిమా దర్శకులకు ప్రేమకు మించిన మంచి సబ్జెక్ట్‌ మరొకటి ఉండదు.

Basha Shek

| Edited By: Anil kumar poka

Feb 14, 2022 | 5:14 PM

నిజ జీవితంలో కొన్ని ప్రేమకథలు విఫలమైనా సిల్వర్‌ స్ర్కీన్‌పై మాత్రం సూపర్‌ హిట్‌ అవుతుంటాయి. అందుకే సినిమా దర్శకులకు ప్రేమకు మించిన మంచి సబ్జెక్ట్‌ మరొకటి ఉండదు. అందుకే యువహీరోలైనా, సీనియర్‌ నటులైనా ప్రేమకథల్లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈక్రమంలో ఇప్పటికే ఎన్నో ప్రేమకథ చిత్రాలు వెండితెరపై సందడి చేశాయి. ప్రేమలోని మధురానుభూతిని పరిచయం చేశాయి. అలా ఈ ఏడాది కూడా ప్రేమపాఠాలు వల్లించేందుకు కొందరు మన ముందుకు రానున్నారు. మరి ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈఏడాది కానున్న ప్రేమకథా చిత్రాలేంటో తెలుసుకుందాం రండి.

రాధేశ్యామ్‌..

‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమాల తర్వాత ప్రభాస్‌ నటించనున్న పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజా హెగ్డే డార్లింగ్ ప్రేయసిగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్లు, ట్రైలర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం మార్చి11 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

రంగరంగ వైభవంగా..

‘ఉప్పెన’తో ఆకట్టుకున్న మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. రొమాంటిక్‌ ఫేం కేతికా శర్మ మెగాహీరోతో రొమాన్స్‌ చేయనుంది. కాలేజీ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈసినిమా పాటలు, పోస్టర్లకు విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా వైష్ణవ్‌, కేతికల కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. తమిళ అర్జున్‌ రెడ్డిని తెరకెక్కించిన గిరీశాయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా మే 27న రిలీజ్‌ కానుంది.

18 పేజీస్‌..

యంగ్‌ హీరో నిఖిల్‌, కేరళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘ 18 పేజీస్‌’. ఒకవేళ ఫోన్‌.. పుస్తకంతో ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా’ అంటూ టీజర్‌తో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది ఈ సినిమా. గతంలో కరెంట్, కుమారి 21F లాంటి ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన పల్నాటి సూర్యప్రతాప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తు్న్నారు. బన్నీవాసు సమర్పణలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

కణ్మని రాంబో ఖతీజా..

‘ఒక అబ్బాయి ఇద్దరి అమ్మాయిలతో ప్రేమలో పడితే ఆ ప్రేమికుడి పరిస్థితేంటి?’ అన్న కథతోనే తెరకెక్కింది కణ్మణి రాంబో ఖతీజా (కాతువాకుల రెండు కాదల్‌). విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలైంది. ఒక్కరోజులోనే కోటి వ్యూస్‌ దాటేసింది. మరి ఈ ప్రేమకథ ఏ తీరానికి చేరుకుందో తెలుసుకోవాలంటే ఏప్రిల్‌ 28 వరకు వెయిట్ చేయాల్సిందే.

థ్యాంక్స్‌..

ఏమాయ చేశావే, 100 పర్సెంట్‌ లవ్‌, మనం చిత్రాల్లో ప్రేమికుడిగా నటించి మెప్పించాడు అక్కినేని నాగచైతన్య. ఇప్పుడు విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ అంటూ రొమాంటిక్‌ లవ్‌స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు. రాశీఖన్నా, మాళవికా నాయర్‌, అవికాగోర్‌ అక్కినేని అందగాడితో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తోన్న ఈ లవ్‌స్టోరీ వేసవిలో విడుదల కానుంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి..

‘ఉప్పెన’తో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టింది కృతిశెట్టి. ఇక సమ్మోహనం, శ్రీదేవి సోడా సెంటర్‌ సినిమాలతో తనలోని ప్రేమికుడిని మనకు పరిచయం చేశాడు సుధీర్‌ బాబు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ ప్రేమకథా చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. అదే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. వైవిధ్యమైన కథలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి ఈ లవ్‌స్టోరీకి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ ప్రేమకథలోని ట్విస్టులేంటో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా..

*నాని, నజ్రియా జోడీగా తెరకెక్కుతోన్న ‘సుందరానికి అంటే’ సినిమాలోనూ ప్రేమకు సంబంధించిన అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

*ఆనంద్‌ దేవర కొండ, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ ఫేం వైష్ణవి చైతన్య జంటగా రూపొందుతోన్న బేబీ కూడా ప్రేమకథాచిత్రమే.

*నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారీ’ కూడా రొమాంటిక్‌ లవ్‌స్టోరీగానే తెరకెక్కుతోంది. అనీష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.
వీటితో పాటు మరెన్నో ప్రేమకథ చిత్రాలు వెండితెరపై సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి.

Also Read:Dhamaka: ప్రేమికుల రోజున ధమాకా నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్.. మాస్ మాహారాజా సరసన శ్రీలీల..

Tollywood Love Stories: ప్రేమలో గెలిచిన టాలీవుడ్ సెలబ్రెటీలు.. అందమైన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటూ..

Tollywood Love Stories: ప్రేమలో గెలిచిన టాలీవుడ్ సెలబ్రెటీలు.. అందమైన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటూ..

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu