- Telugu News Entertainment Tollywood Know the tollywood celebreties romantic love stories ram charan upasana allu arjun sneha to rana mihika nani anjana
Tollywood Love Stories: ప్రేమలో గెలిచిన టాలీవుడ్ సెలబ్రెటీలు.. అందమైన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటూ..
హీరో కార్తికేయ ... లోహిత కాలేజీలో మంచి స్నేహితులు. మొదటి సారి లోహితను చూడగానే ప్రేమలో పడిపోయాడట కార్తికేయ. కార్తికేయ ప్రపోజ్ చేసిన సంవత్సరం తర్వాత లోహిత ప్రేమను అంగీకరించిందట.
Updated on: Feb 14, 2022 | 5:17 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు.. నమ్రత శిరోద్కర్ కలిసి వంశీ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్లోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు అన్యోనంగా ఉంటారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ పార్టీలో స్నేహాను చూసి ప్రేమలో పడిపోయారట. తొలిచూపులోనే ప్రేమలో పడిపోయానని.. తన లవ్ ను కాస్త ఆలస్యంగా స్నేహ ఒప్పుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

న్యాచురల్ స్టార్ నాని.. తన ఫ్రెంజ్ కజిన్ అంజనను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోయారు. తన భార్య అంజన.. పెళ్లి తర్వాత తమ మధ్య జరిగిన క్షణాలను అక్షరాలుగా కూర్చి ఓ డైరీగా బహుమతి ఇచ్చిందట.

రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు మంచి స్నేహితులు. ఆ తర్వాత వీరు పెళ్లితో తమ ప్రేమను గెలిపించుకున్నారు. వీరిద్దరు ఎక్కువగా మూగజీవులను బహుమతులుగా ఇచ్చుకుంటారట.

రానా.. మిహికాను ముంబైలో జరిగిన ఓ బాలీవుడ్ పార్టీలో కలుసుకున్నాడట. మిహికా.. వెంకీ కూతురుకు మంచి స్నేహితురాలు. అలా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటలెక్కింది.

హీరో కార్తికేయ ... లోహిత కాలేజీలో మంచి స్నేహితులు. మొదటి సారి లోహితను చూడగానే ప్రేమలో పడిపోయాడట కార్తికేయ. కార్తికేయ ప్రపోజ్ చేసిన సంవత్సరం తర్వాత లోహిత ప్రేమను అంగీకరించిందట.




