అక్షయ్‌ స్టంట్‌పై ట్వింకిల్‌ ఆగ్రహం

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ చేసిన ఓ భయంకరమైన స్టంట్‌ పట్ల ఆయన భార్య ట్వింకిల్‌ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ది ఎండ్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో అక్షయ్‌కుమార్‌ నటించబోతున్నారు. తాను నటించబోయే తొలి యాక్షన్ వెబ్ సిరీస్ కావడంతో కాస్త డిఫరెంట్‌గా ఎనౌన్స్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా అందర్ని ఆశ్యర్యానికి, థ్రిల్‌కి గురిచేస్తూ  ఒంటికి నిప్పంటించుకుని స్టేజ్‌పై నడిచారు. భర్త చేసిన నిర్వాకంపై  ట్వింకిల్‌ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. ‘ఛీ.. […]

అక్షయ్‌ స్టంట్‌పై ట్వింకిల్‌ ఆగ్రహం
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 06, 2019 | 1:03 PM

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ చేసిన ఓ భయంకరమైన స్టంట్‌ పట్ల ఆయన భార్య ట్వింకిల్‌ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ది ఎండ్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో అక్షయ్‌కుమార్‌ నటించబోతున్నారు. తాను నటించబోయే తొలి యాక్షన్ వెబ్ సిరీస్ కావడంతో కాస్త డిఫరెంట్‌గా ఎనౌన్స్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా అందర్ని ఆశ్యర్యానికి, థ్రిల్‌కి గురిచేస్తూ  ఒంటికి నిప్పంటించుకుని స్టేజ్‌పై నడిచారు.

భర్త చేసిన నిర్వాకంపై  ట్వింకిల్‌ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. ‘ఛీ.. నీ ఒంటికి నువ్వే నిప్పటించుకోవడానికి ఈ తీరును ఎంచుకున్నావన్నమాట. ఈ విన్యాసం చేసిన తర్వాత కూడా బతికే ఉంటే ఇంటికిరా.. నిన్ను నేను చంపేస్తాను’ అంటూ చిర్రుబుర్రులాడారు. అంతేకాదు ‘దేవుడా నన్ను కాపాడు’ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. ట్వింకిల్‌ ట్వీట్‌కు అక్షయ్‌ స్పందిస్తూ.. ‘ఇప్పుడు నాకు నిజంగా భయమేస్తుంది’ అని చమత్కరించారు.

ఈ సాహసోపేతమైన ఘటన గురించి అక్షయ్‌ వివరిస్తూ.. ‘యాక్షన్‌ నా రక్తంలోనే ఉంది. ముందు నేను స్టంట్‌మ్యాన్‌ని. ఆ తర్వాతే యాక్టర్‌ని’ అని తెలిపారు. అయితే తాను చేయబోయే వెబ్‌సిరీస్‌ షో గురించి అక్షయ్‌ ఎక్కువ వివరాలను వెల్లడించలేదు. తన కుమారుడు ఆరవ్‌ సూచన మేరకు ఈ వెబ్‌సిరీస్‌లో నటించడానికి ఒప్పుకొన్నట్లు చెప్పారు. ఈ వెబ్‌ సిరీస్‌తో పాటు అక్షయ్‌ ‘కేసరి’, ‘సూర్యవంశి’ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు. మార్చి 21న ‘కేసరి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.