మహేశ్ సరసన క్రేజీ హీరోయిన్లు..?

సుకుమార్‌తో సినిమా క్యాన్సిల్ అవ్వడంతో అనిల్ రావిపూడితో సెట్స్ మీదకు వెళ్లాలని సూపర్‌స్టార్ మహేశ్ బాబు భావిస్తున్నాడు. దీంతో ప్రీ ప్రొడక్షన్ పనులలో వేగాన్ని పెంచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ క్రమంలో నటీనటులను ఎంచుకుంటోన్న అనిల్.. మహేశ్ కోసం ఇద్దరు హీరోయిన్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో క్రేజీ ఇమేజ్ సాధించిన సాయి పల్లవి, రష్మిక మందన పేర్లను అనిల్ రావిపూడి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా టాక్. కాగా […]

మహేశ్ సరసన క్రేజీ హీరోయిన్లు..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 06, 2019 | 1:01 PM

సుకుమార్‌తో సినిమా క్యాన్సిల్ అవ్వడంతో అనిల్ రావిపూడితో సెట్స్ మీదకు వెళ్లాలని సూపర్‌స్టార్ మహేశ్ బాబు భావిస్తున్నాడు. దీంతో ప్రీ ప్రొడక్షన్ పనులలో వేగాన్ని పెంచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ క్రమంలో నటీనటులను ఎంచుకుంటోన్న అనిల్.. మహేశ్ కోసం ఇద్దరు హీరోయిన్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో క్రేజీ ఇమేజ్ సాధించిన సాయి పల్లవి, రష్మిక మందన పేర్లను అనిల్ రావిపూడి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా టాక్. కాగా ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.