Yashoda: అప్పుడే ఓటీటీ పార్టనర్ ఫిక్స్ చేసుకున్న యశోద.. సమంత సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే ?..
శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది.
సమంత టైటిల్ పాత్రలో యశోద సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా డీసెంట్ సూపర్ హిట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సరోగసి నేపథ్యంలో డైరెక్టర్స్ హరి, హరీష్ తెరకెక్కించిన ఈ మూవీలో సమంత గర్భవతిగా నటించింది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇందులో ఉన్ని ముకుందన్.. వరలక్ష్మి కీలకపాత్రలలో నటించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. తాజాగా ఫిల్మ్ వర్గాల టాక్ ప్రకారం సమంత నటించిన సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ను ఫిక్స్ చేసుకున్నట్లుగా సమాచారం.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో యశోద సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా దాదాపు నాలుగైదు వారాల అనంతరం ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన ప్పటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సామ్ ఫస్ట్ లుక్, టీజర్, విడుదలై సినిమా పై క్యూరియాసిటిని పెంచేశాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
మెడికల్ మాఫియా నేపథ్యంలో యశోద చిత్రాన్ని తెరకెక్కించారు. కొత్త కాన్సెప్ట్‌ను ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా కోసం సమంత ప్రాణం పెట్టి నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో సామ్ ఎంతో కష్టపడి చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది.