AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: సూపర్ రెస్పాన్స్‏తో దూసుకుపోతున్న వాట్స్ హ్యాపెనింగ్ సాంగ్.. ధమాకా సినిమాపై మరిన్ని అంచనాలు..

శుక్రవారం ఈ చిత్రం నుండి వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడీ గా కంపోజ్ చేశారు.

Raviteja: సూపర్ రెస్పాన్స్‏తో దూసుకుపోతున్న వాట్స్ హ్యాపెనింగ్ సాంగ్.. ధమాకా సినిమాపై మరిన్ని అంచనాలు..
Dhamaka
Rajitha Chanti
|

Updated on: Nov 12, 2022 | 8:27 AM

Share

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తోన్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. ఈ మూవీలో రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. శుక్రవారం ఈ చిత్రం నుండి వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడీ గా కంపోజ్ చేశారు. శేఖర్ మాస్టర్ ఈ పాటని చాలా గ్రేస్ ఫుల్ గా కోరియోగ్రఫీ చేశారు. శ్రీలీల డ్యాన్స్ మూమెంట్స్ స్టయిలీష్ గా ఆకట్టుకున్నాయి. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఈ పాటకు సరస్వతి పుత్ర రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్ మనసులోని ఫీలింగ్స్ ని అందంగా, మ్యాజికల్ గా ప్రజంట్ చేశారు. రమ్య బెహరా, భార్గవి పిళ్లై తమ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. వినగానే ఇట్టే ఆకట్టుకునే ఈ ట్యూన్ ని అద్భుతంగా అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో. ట్యూన్ తో పాటు సాంగ్ లో విజువల్స్ కూడా బాగున్నాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!