Vakkantham Vamshi: ఆ సినిమా కోసం ముందు అనుకున్నది అల్లు అర్జున్‏ను కాదట.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Nov 18, 2022 | 9:37 AM

ఇండస్ట్రీలో మంచి రైటర్‏గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Vakkantham Vamshi: ఆ సినిమా కోసం ముందు అనుకున్నది అల్లు అర్జున్‏ను కాదట.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..
Vakkantham Vamshi

ఎన్టీఆర్ చేయాల్సింది.. అల్లు అర్జున్ చేశాడట.. ఈ సినిమాపై పెదవి విప్పిన డైరెక్టర్ వక్కంతం వంశీ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఫేమస్ రచయితలలో వక్కంతం వంశీ ఒకరు. ఇండస్ట్రీలో మంచి రైటర్‏గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‏గా నిలిచింది. అయితే ఈ సినిమా ముందు బన్నీ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిందట. ఈ విషయాన్ని స్వయంగా వక్కంతం వంశీ వెల్లడించారు.

అలీతో సరదాగా షోలో పాల్గోన్న వక్కంతం వంశీ తన వ్యకిగత జీవితం.. సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు కిక్ సినిమా రచయితగా గుర్తింపు ఇచ్చిందని.. టెంపర్ సినిమా కథను ఎన్టీఆర్ కు చెప్పగానే దానికి నేను సూట్ అవుతానా ? అని అడిగినట్లు చెప్పుకొచ్చారు. ఆ సినిమా క్లైమాక్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా కథ ముందు ఎన్టీఆర్ కోసం అనుకున్నాడట. అప్పటికే తనని దర్శకుడిగా పరిచయం చేస్తానని తారక్ చెప్పడంతో ఆయన కోసం ఈ స్టోరీ రెడీ చేశారట. కానీ అది చివరకు అల్లు అర్జున్ చేతుల్లోకి వెళ్లింది. కానీ ఈ సినిమా విజయం సాధించలేకపోయింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu