Krishna: తాతయ్యను కడసారి చూసుకోలేకపోయిన రమేష్ బాబు తనయుడు.. కృష్ణ ఫోటో చూసి జయకృష్ణ భావోద్వేగం..
తన తాతయ్యను కడసారి చూసుకోలేకపోయినందుకు కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. అమెరికాలో ఉంటున్న జయకృష్ణ నిన్న
ఘట్టమనేని కుటుంబంలో ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని నింపింది. సంవత్సరం ప్రారంభంలోనే మహేష్ బాబు అన్నయ్య.. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇక సెప్టెంబర్లో మహేష్ తల్లి ఇందిలా దేవి మరణించగా.. ఈ నెల 15న సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. నటశేఖరుడి మరణంతో మహేష్ కుటుంబంతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. బుధవారం జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో వందలాది మంది అభిమానులు.. సినీ, రాజకీయ ప్రముఖ మధ్య కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు. అయితే తన తాతయ్యను కడసారి చూసుకోలేకపోయినందుకు కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. అమెరికాలో ఉంటున్న జయకృష్ణ నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే కార్యక్రమాలన్నీ పూర్తి కావడంతో ఎమోషనల్ అయ్యాడు. గురువారం జరిగిన కృష్ణ సంతాప సభ, చిన్న కర్మ కార్యక్రమాల్లో జయకృష్ణ పాల్గొన్నారు. తాతయ్య ఫోటో వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు.
ఘట్టమనని కుటుంబం గురువారం మధ్యాహ్నం హైదరాబాద్లోని ఫిలింనగర్ లోని కల్చరల్ క్లబ్ లో సంతాప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కేవలం కుటుంబసభ్యులు.. సినీ పరిశ్రమకు చెందిన కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కృష్ణకు గుండెపోటు రావడంతో ఆయనను కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందిన కృష్ణ మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది.
గురువారం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చిన్న కుమారుడు మహేష్ కృష్ణ కు తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. కృష్ణ కన్నుమూసే సమయానికి మహేష్ తనయుడు గౌతంకృష్ణ కూడా విదేశాల్లోనే ఉన్నారు. లండన్ నుంచి మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకోవడంతో గౌతం కృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.