RK.Roja: సినిమాల్లోకి హీరోయిన్గా కూతురి ఎంట్రీపై స్పందించిన రోజా.. ఏమన్నారంటే..
తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. తన కూతురు సినీ ఎంట్రీపై స్పందించింది.

సీనియర్ హీరోయిన్.. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి బుధవారం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. తన కూతురు సినీ ఎంట్రీపై స్పందించింది. “నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది, ఎన్నిసార్లు వచ్చినా ఆయన దివ్య స్వరూపం కంటతడి పెట్టిస్తోంది. నా పదవీకాలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే గత కొద్ది రోజులుగా తన కూతురు సినీ ఎంట్రీపై వస్తున్న వార్తలపై స్పందించారు. నటన ఎప్పుడూ తప్పు కాదు . “నా కొడుకు.. కూతురు సినిమా రంగంలోకి రావాలంటే చాలా సంతోషిస్తాను. కానీ ప్రస్తుతం నా కూతురు మాత్రం చదువులో రాణిస్తుంది. తను సైంటిస్ట్ కావాలనుకుంటుంది. ఆమెకు ఇప్పుడు సినిమాల్లోకి వచ్చే ఆలోచన మాత్రం లేదు. ఒకవే ళ ఎప్పుడైనా సినిమాల్లోకి తను రావాలనుకుంటే మాత్రం నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది రోజా..




రోజా కూతురు అన్షు మాలిక చిన్న వయసులోనే ఎంతో ఎత్తుకు ఎదిగింది. పుస్తకాలు రచిస్తోంది. ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంటుంది. అలాగే సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటుంది. ఇప్పటికే తను ఇద్దరిని చదివిస్తోంది. అన్షు చిన్నప్పటి నుంచే సామాజిక సేవలపట్ల ఆకర్షితురాలై ఓ స్వచ్చంద సంస్థకు సహాయసహాకారాలు అందిస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




