Nani: మళ్లీ అదే సెంటిమెంట్.. నేచురల్ స్టార్ట్ నయా మూవీలో మరో హీరో..?
కంటెంట్ ఉన్న సినిమా.. పైగా మాస్ పాత్ర.. ఇక మన నేచురల్ స్టార్ ఊరుకుంటాడా.. మరోసారి తన సహజ నటనతో కట్టిపడేసాడు. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. అలాగే ఈ మూవీలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది

నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా దసరా సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. తనకు కలిసొచ్చిన లవర్ బాయ్ బోర్డర్ దాటి మాస్ పాత్రలో నటించి మెప్పించాడు. కంటెంట్ ఉన్న సినిమా.. పైగా మాస్ పాత్ర.. ఇక మన నేచురల్ స్టార్ ఊరుకుంటాడా.. మరోసారి తన సహజ నటనతో కట్టిపడేసాడు. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. అలాగే ఈ మూవీలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత మరో కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు నాని. ఆయన కెరీర్ లో ఇది 30వ సినిమా.. ఈ సినిమా తండ్రి కూతురు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. ఇప్పటికే నాని 30 నుంచి విడుదలైన గ్లింమ్స్ సినిమా పై అంచనాలు పెంచేసింది.
అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా శ్రుతిహాసన్ కనిపించనుందట. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అలాగే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో నానితో పాటు మరో హీరో కూడా నటించనున్నాడని తెలుస్తోంది. శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మరో హీరోగా విరాజ్ అశ్విన్ నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ యంగ్ హీరో రీసెంట్ గా బేబీ సినిమాలో నటించాడు. ఇప్పుడు నాని సినిమాలో కనిపించబోతున్నాడట. అయితే నాని సినిమాల్లో సెకండ్ హీరో సెంటిమెంట్ కొత్తేమీ కాదు. నాని సినిమాల్లో దాదాపు అన్ని సినిమాల్లో సెకండ్ హీరో ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో రానున్నాడు నాని.Viraj Ashwin