NTR 30: దసరాకి రాలేదు.. మరి దీపావళికైనా అప్డేట్ ఉందా..? ఆసక్తిగా ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్
తారక్ డాన్స్ కు, యాక్టింగ్ కు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. తారక్ క్రేజీ ఈ మధ్య కాలంలో డబుల్ అయ్యింది. మొన్నటి వరకు టాలీవుడ్ కోలీవుడ్ అలాగే పక్కనున్న కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే తారక్ కు ఫ్యాన్స్ ఉండే వాళ్ళు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తారక్ డాన్స్ కు, యాక్టింగ్ కు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. తారక్ క్రేజీ ఈ మధ్య కాలంలో డబుల్ అయ్యింది. మొన్నటి వరకు టాలీవుడ్ కోలీవుడ్ అలాగే పక్కనున్న కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే తారక్ కు ఫ్యాన్స్ ఉండే వాళ్ళు. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్. ఇక ఇప్పుడు కొరటాల సినిమా పనుల్లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆచార్య ఎఫెక్ట్ ఏమాత్రం పడకుండా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట కొరటాల. అందుకోసమే ఎక్కువ టైం తీసుకుంటున్నారట. అయితే ఇక ఈ సినిమాను కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు.
కొరటాల మాత్రం ఈసారి సాలిడ్ హిట్ కొట్టి.. గట్టి కామ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఈ మేరకు ఓ అదిరిపోయే కథను సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. తారక్ పవర్ఫుల్ డైలాగ్ తో ఈ మోషన్ పోస్టర్ ను డిజైన్ చేశారు. అయితే ఆ తర్వాత ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. అటు ఈ సినిమాకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తారక్ అభిమానులు.
అయితే దసరా రోజున ఈ సినిమానుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఆసక్తిగా ఎదురుచూశారు ఫ్యాన్స్. కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. దాంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ఇక ఇప్పుడు దీపావళికి ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని చూస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాల అప్డేట్స్ వచ్చేశాయ్. ఈ క్రమంలోనే తారక్ ఎం కొరటాల సినిమా అప్డేట్ కూడా వస్తుందేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి కొరటాల టీమ్ ఏమ్ చేస్తారో చూడాలి.








