Ram Pothineni: ఉస్తాద్ రామ్ రంగంలోకి దిగేది అప్పుడేనట.. షూటింగ్ ముహూర్తం ఖరారు

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే..

Ram Pothineni: ఉస్తాద్ రామ్ రంగంలోకి దిగేది అప్పుడేనట.. షూటింగ్ ముహూర్తం ఖరారు
Ram Pothineni
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 01, 2022 | 8:17 AM

యంగ్ హీరో రామ్ పోతినేని ఓ సాలిడ్ హిట్ కొట్టడం కోసం కసిగా ఉన్నాడు. అప్పుడెప్పుడో ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు పూరిజగన్నాథ్. అప్పటివరకు వరకు లవర్ బాయ్ గా ఉన్న రామ్ ను ఊర మాస్ లుక్ లో చూపించాడు పూరి. ఇక ఈ సినిమాలో తనదైన డైలాగ్ డెలివరీతో.. తెలంగాణ యాసలో.. యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు రామ్. ఇక ఈ సినిమా తర్వాత రెడ్ అనే సినిమా చేశాడు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఈ సినిమా తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో వారియర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన వారియర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. తమిళ్ తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమాలో అందాల భామ కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు టాప్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్. ఇటీవలే అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు బోయపాటి. బాలయ్య నటించిన అఖండ సినిమా తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది.

ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈసినిమా  సెట్స్ మీదకు వెళ్లడం లేట్ అవుతుండటంతో సోషల్ మీడియాలో పలు రూమర్స్ వస్తున్నాయి. ఈ సినిమాతో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు రామ్. అయితే బోయపాటికంటే ముందు గౌతమ్ మీనన్ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 6వ తేదీన రామ్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని బోయపాటి నిర్ణయించుకున్నారట. సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాలేదని అంటున్నారు. రామోజీ ఫిలిం సిటీలో నిర్మిస్తున్న ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!