AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో దర్శకుడికి ఓకే చెప్పిన రాకింగ్ స్టార్.. యష్ నయా మూవీ ఆ డైరెక్టర్ తోనే..

బుల్లితెర ద్వారా యష్ ఫేమస్ అయ్యాడు. చాలా టీవీ సీరియల్స్‌లో నటించాడు. ఆ తర్వాత ‘మనసారే’ సినిమా ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత మాస్ హీరోగా ఎదిగాడు. ‘కేజీఎఫ్’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ‘కేజీఎఫ్ 2’ సినిమా సూపర్ హిట్ అయింది.

మరో దర్శకుడికి ఓకే చెప్పిన రాకింగ్ స్టార్.. యష్ నయా మూవీ ఆ డైరెక్టర్ తోనే..
Yash
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2025 | 11:18 AM

Share

రాకింగ్ స్టార్ యష్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. యష్ కేవలం కన్నడ హీరో మాత్రమే కాదు ఇప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో. ఓ సాధారణ బస్ డ్రైవర్ కొడుకు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన యష్ .. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో యష్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆతర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 సినిమాతో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత యష్ నటించే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణం’ ప్రాజెక్ట్‌లో యష్ కూడా నటిస్తాడని, ఈ సినిమా షూటింగ్ గురించిన సమాచారం. ‘రామాయణం’ సినిమాలో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. నెగెటివ్ రోల్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదట్లో ఈ విషయం గోప్యంగా ఉండేది. తరువాత యష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో కన్ఫార్మ్ చేశారు. రావణుడి పాత్రలో నటించేందుకు ఆసక్తితో ఉన్నానని తెలిపారు. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు యష్.

ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తర్వాత యష్ ఇప్పుడు మరో సినిమాను లైనప్ చేశాడని తెలుస్తుంది.  యష్ ప్రముఖ తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించే కొత్త చిత్రంలో నటించనున్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ మిత్రన్ ప్రస్తుతం కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సర్దార్ 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అతను యష్‌తో కలిసి కొత్త సినిమా చేస్తాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి