Devara 1: దేవర కోసం పుష్పరాజ్..? ఒకే స్టేజ్ పైకి తారక్, అల్లు అర్జున్
దేవర సినిమా పై ప్రపంచవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ అయ్యింది. కొరటాల శివ ఈ సినిమాను అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా దేవరను రెడీ చేస్తున్నారు కొరటాల. ఆచార్య సినిమాలో దెబ్బ తిన్న కొరటాల శివ ఈసారి భారీ హిట్ కొట్టి ఆచార్య మచ్చను మాపుకోవాలని చూస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి సంచలన హిట్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో దేవర సినిమా పై ప్రపంచవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ అయ్యింది. కొరటాల శివ ఈ సినిమాను అదే రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా దేవరను రెడీ చేస్తున్నారు కొరటాల. ఆచార్య సినిమాతో దెబ్బ తిన్న కొరటాల శివ ఈసారి భారీ హిట్ కొట్టి ఆచార్య మచ్చను మాపుకోవాలని చూస్తున్నారు. దేవర సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, వీడియోలు ప్రేక్షకులను మెప్పించాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాయి..
ఇది కూడా చదవండి :మొగుడు ముసలోడు.. యవ్వారానికి మరొకడు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమా..
యూట్యూబ్ లో మిలియన్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి సాంగ్స్. ఈ రోజు దేవర సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమా ఎలా ఉంటుందా అని వెయ్యి కళ్ళతో ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి రోజుకొక రూమర్స్ వినిపిస్తున్నాయి. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఓ స్టార్ హీరో గెస్ట్ గా హాజరవుతాడని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : Chiranjeevi : మెగాస్టార్‌తో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.? ఇండస్ట్రీనే ఊపేశాడు అతను
నిజానికి ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ అవసరం లేదు.. ఆయనే ఇతర హీరోల సినిమా ఈవెంట్స్ కు గెస్ట్ గా జరవుతారు. ఇక ఇప్పుడు దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌కు బన్నీకి మధ్య మంది స్నేహం ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ బావ బావ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరూ తమ పుట్టిన రోజులకు సోషల్ మీడియాలో ఒకరికొకరు విషెస్ తెలుపుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ స్టార్స్ ఒకే స్టేజ్ పైకి రానున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. మరో వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవుతాడని కూడా టాక్ వినిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.