Brahmastra: వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ బడా మూవీ.. బ్రహ్మాస్త్రను బాయ్ కాట్ చేయాలంటున్న నెటిజన్లు

మేకర్స్ ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీశారన్నది కాదు.. అందులో అందరి మనోభావాలను గౌరవించారా లేదా అన్నదే ముఖ్యం అంటున్నారు నెటిజెన్స్. అలా గౌరవించకుండా కించపరిచే సినిమాలన బ్యాన్ చేయాల్సిందే అని సోషల్‌ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ రన్ చేస్తుంటారు

Brahmastra: వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ బడా మూవీ.. బ్రహ్మాస్త్రను బాయ్ కాట్ చేయాలంటున్న నెటిజన్లు
Brahmastra
Rajeev Rayala

| Edited By: Team Veegam

Jun 18, 2022 | 11:43 AM

మేకర్స్ ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీశారన్నది కాదు.. అందులో అందరి మనోభావాలను గౌరవించారా లేదా అన్నదే ముఖ్యం అంటున్నారు నెటిజెన్స్. అలా గౌరవించకుండా కించపరిచే సినిమాలన బ్యాన్ చేయాల్సిందే అని సోషల్‌ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ రన్ చేస్తుంటారు. ఆ మేకర్స్ను ట్రోల్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ పాన్ ఇండియన్ సినిమా బ్రహ్మస్త్రం విషయంలోనూ అదే జరుగుతోంది. బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర(Brahmastra). ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు.  రణబీర్ కపూర్ – అలియా భట్ – అమితాబ్ బచ్చన్ – మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను మూడు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’  ఫస్ట్ పార్ట్ ని ”బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ” పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ట్రైలర్ పై పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మస్త్రం సినిమాను బ్యాన్ చేయాలంటూ.. బాయ్‌ కాట్‌ చేయాలంటూ #BOycottBrahmastra అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో రన్ అవుతోంది. ట్రైలర్లో.. హీరో రణ్‌బీర్ షూస్ వేసుకుని అమ్మవారి ఆలయంలోని గంట కొడుతున్న సీన్‌ ను చూపిస్తున్న నెటిజన్లు.. ఈ మూవీ మేకర్స్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమాను బాయ్‌ కాట్ చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు.  మరి ఈ వివాదం పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే బ్రహ్మస్త్రం మూవీ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. రాజమౌళి ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తుండడంతోపాటు.. ప్రమోట్ చేస్తుండడంతో.. ఈ సినిమా పై ఇప్పటికే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్ అయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu