`విజిల్‌` పక్కాగా విజిల్ వేయించే సినిమా

తారాగణం: విజయ్, నయనతార, వివేక్, యోగిబాబు, జాకీష్రాఫ్, డేనియల్ బాలాజీ, అనంత్‌రాజ్ తదితరులు సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ దర్శకత్వం: అట్లీ ఇంట్రో:  కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సినిమాల‌కు త‌మిళంలో ఉన్నంత మార్కెట్ రేంజ్ తెలుగులో లేదు. అయితే ఈ మ‌ధ్య ఆయ‌న న‌టించిన త‌మిళ సినిమాలు తెలుగులోకి అనువాద‌మ‌వుతున్నాయి. ఆ క్ర‌మంలో విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం `బిగిల్‌` కూడా తెలుగులో `విజిల్‌` పేరుతో విడుద‌లైంది. విజ‌య్‌ సినిమాకు మ‌రెన్న‌డూ […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:45 pm, Fri, 25 October 19
`విజిల్‌` పక్కాగా విజిల్ వేయించే సినిమా

తారాగణం: విజయ్, నయనతార, వివేక్, యోగిబాబు, జాకీష్రాఫ్, డేనియల్ బాలాజీ, అనంత్‌రాజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ:
జీకే విష్ణు
సంగీతం:
ఏ.ఆర్.రెహమాన్
దర్శకత్వం:
అట్లీ

ఇంట్రో: 

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సినిమాల‌కు త‌మిళంలో ఉన్నంత మార్కెట్ రేంజ్ తెలుగులో లేదు. అయితే ఈ మ‌ధ్య ఆయ‌న న‌టించిన త‌మిళ సినిమాలు తెలుగులోకి అనువాద‌మ‌వుతున్నాయి. ఆ క్ర‌మంలో విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం `బిగిల్‌` కూడా తెలుగులో `విజిల్‌` పేరుతో విడుద‌లైంది. విజ‌య్‌ సినిమాకు మ‌రెన్న‌డూ లేనంత‌గా ఎక్కువ థియేట‌ర్స్ దొర‌క‌డం, దీపావ‌ళి పోటీలో మ‌రో సినిమా లేక‌పోవ‌డంతో `విజిల్‌`పై అంద‌రిలో కాస్త ఆస‌క్తి పెరిగింది. మ‌రి `విజిల్‌` తెలుగులో విజ‌య్‌కు ఎలాంటి విజయాన్ని అందించింద‌నేది తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ్లాల్సిందే..

కథ..

రాయప్పన్ (విజయ్) చెన్నైలోని ఓ మురికివాడలో గ్యాంగ్‌స్టర్‌గా చెలామణి అవుతుంటాడు. తన కొడుకు మైఖేల్ అలియాస్ విజిల్‌ను (విజయ్) జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా చూడాలన్నది రాయప్పన్ ఆశయం. ఫుట్‌బాల్ నేషనల్ ఛాంపియన్‌ఫిప్‌లో పాల్గొనడానికి విజిల్ ఢిల్లీ వెళ్తున్న సమయంలో రాయప్పన్ హత్యకు గురవుతాడు. దీంతో మైఖేల్ పుట్‌బాల్ క్రీడకు దూరమై గ్యాంగ్‌స్టర్‌గా తండ్రి బాధ్యతల్ని స్వీకరిస్తాడు. అయితే ఒక స్నేహితుడి మరణంతో విజిల్ జీవితం మలుపు తిరుగుతుంది. మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో విజిల్ జీవితంలో ఎదురైన సంఘటనలు ఏమిటి? మహిళల్ని స్ఫూర్తివంతంగా తీర్చిదిద్ది విజేతలుగా నిలిపే క్రమంలో విజిల్ చేసిన ప్రయత్నాలేమిటి? ఈ అంశాలన్నింటకి సమాధానమే మిగతా చిత్ర కథ..

నటీనటుల ఫెర్పామెన్స్:

‘మెర్సల్’ తర్వాత మరోసారి విజయ్ తండ్రి కొడుకుల పాత్రల్లో మెప్పించాడు. రాజప్ప, బిగిల్ రెండు పాత్రల్లో తనదైన నటనను కనబరిచాడు.రాజప్ప పాత్రలో మాస్‌ను మెప్పించాడు. తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఆయన పాత్రను అట్లీ డిజైన్ చేసినట్టు కనబడుతోంది. సినిమా ఆద్యంతం విజయ్ తన భుజాలపై మోశాడు. కథానాయికగా నయనతార అభినయం ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్ర చిత్రణకు కథలో అంతగా ఇంపార్టెన్స్ లేదు. విలన్‌గా జాకీష్రాఫ్ అంత బలంగా కనిపించలేదు. మిగతా పాత్రల్లో యోగిబాబు, వివేక్ ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక వర్గం:

‘ఖైదీ’కి సాంకేతిక నిపుణులు బలాన్నిచ్చారు. సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం సన్నివేశాల్ని ఎలివేట్ చేయడంలో.. ప్రేక్షకుల్లో భావోద్వేగాల్ని రేకెత్తించడంలో కీలక పాత్ర పోషించింది. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం గురించి చెప్పడానికి చాలా ఉంది. పూర్తిగా రాత్రి పూట సాగే సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ ఛాయాగ్రాహకుడి కష్టం.. ప్రతిభ కనిపిస్తాయి. ఇలాంటి కథతో సినిమా చేయడానికి ముందుకొచ్చి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత ఎస్.ఆర్.ప్రభును అభినందించాలి. ‘మా నగరం’ (తెలుగులో నగరం)తో సత్తా చాటిన లోకేష్ కనకరాజ్.. ఈసారి అనేక పరిమితులున్న – సాహసోపేత కథను నెత్తికెత్తుకుని తనకు తానే సవాల్ విసురుకున్నాడు. పట్టు సడలని స్క్రీన్ ప్లేతో సినిమాను ఆసక్తికరంగా నడిపించి దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు.

ఫైనల్ థాట్: 

మొత్తంగా చెప్పాలంటే విజిల్ మూవీ మాస్ ఎలిమెంట్స్ మరియు ఎమోషనల్ కంటెంట్ తో సాగే స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆసక్తిగా సాగే సన్నివేశాలు, ఎమోషన్స్ తో ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతుంది. మాస్ ఇమేజ్ ఉన్న విజయ్ ని అట్లీ ఒక రేంజ్ లో తెరపై ప్రెసెంట్ చేశారు.తమిళ నేటివిటీ తో సాగే చాలా సన్నివేశాలు తమిళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి అనడంలో సందేహం లేదు. కానీ తెలుగు ప్రేక్షకులకు కొంచెం రొటీన్ అన్న భావన రావొచ్చు. ఐతే ప్రేక్షకుడిని నిరాశపరిచే చిత్రం ఐతే కాదు. ఏదేమైనా విజిల్ మూవీ అందరూ చూడదగ్గ చిత్రమే. విజయ్ ఫ్యాన్స్ చేత విజిల్ మూవీ విజిల్ వేయిస్తుంది అనడంలో సందేహం లేదు.

ఒక్కమాటలో: `విజిల్‌` ..విజిల్ వేయించే సినిమా!